సాక్షి, న్యూఢిల్లీ : ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందడంతో.. ముస్లిం మహిళలు మరో డిమాండ్‌ను కేంద్రం ముందుంచారు. ముస్లిం మహిళలకు శాపంగా మారిన ట్రిపుల్ తలాక్‌తో పాటు బహుభార్యత్వాన్ని కూడా రద్దు చేయాలని మహిళలు ప్రభుత్వాన్ని కోరారు. ట్రిపుల్ తలాక్ కన్నా.. బహుభార్యత్వం వల్ల ముస్లిం మహిళలు అధికంగా బాధలు పడుతున్నారని.. పలువురు ముస్లిం మహాళా న్యాయవాదులు చెబుతున్నారు.
ట్రిపుల్ తలాక్, బహుభార్యత్వంపై న్యాయపోరాటం చేస్తున్న ఫరా ఫయాజ్, రిజ్వానా, రజియాలు ఈ విషయం మరోసారి గళం విప్పారు. ట్రిపుల్ తలాక్ తెచ్చిన ఊపుతోనే.. బహుభార్యత్వాన్ని నిషేధించే చట్టాన్ని మోదీ ప్రభుత్వం తీసుకురావాలని.. వారు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment