
సాక్షి, న్యూఢిల్లీ : ముస్లిం మహిళలకు కేంద్ర ప్రభుత్వం మరింత మద్దతు తెలుపుతోంది. ట్రిపుల్ తలాక్‌ను పూర్తిస్థాయిలో రద్దు చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తలాక్‌ను రద్దు చేసే క్రమంలో భాగంగా బిల్లును రూపొందించేందుకు కేంద్రం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా.. బిల్లు రూపకల్పనకు మంత్రివర్గ కమిటీ ఏర్పాటు చేసినట్లు స్పష్టమైన సమాచారం. ఈ బిల్లును ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముస్లిం వ్యవస్థలో భాగమైన ఈ తలాక్ వల్ల మహిళలు అన్యాయానికి గురువుతున్నారని, వారికి చట్ట పరమైన రక్షణ కల్పించేందుకు ఈ బిల్లును రూపొందిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా గతంలో సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ విధానాన్ని రద్దు చేసిన సంగతి తెలిసిందే. ట్రిపుల్ తలాక్ రాజ్యాంగ విరుద్ధమని గత ఆగస్టు 22న సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన విషయం విదితమే. అదే సమయంలో ట్రిపుల్ తలాక్ అనేది మత విశ్వాసాలకు సంబంధించినది.. కావడం వల్ల దీనిపై కేందం స్పష్టమైన చట్టాన్ని చేయాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం బిల్లును రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment