
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈడీ, ఐటీ దాడుల ప్రకంపనల వేళ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. వారం రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.
కాగా, అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ స్పందించారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోంది. కేంద్రం విధిస్తున్న అనవసర ఆంక్షల వల్ల తెలంగాణకు రూ.40వేల కోట్ల ఆదాయం తగ్గిందన్నారు. ఈ విషయాన్ని అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment