
Rohit Sharma Achieved Many Milestones In December: రోహిత్ శర్మ టీమిండియా పరిమిత ఓవర్ల ఫుల్‌టైమ్ కెప్టెన్(వన్డే కెప్టెన్)గా 2021 డిసెంబర్ 8న నియమితుడైన సంగతి తెలిసిందే. అయితే యాధృచ్చికంగా అతనికి ఈ నెల భలే కలిసొస్తుంది. గతంలో మైదానం లోపల, వెలుపల ఎన్నో మైలురాళ్లను రోహిత్ ఇదే నెలలో చేరుకున్నాడు. అతని వ్యక్తిగత జీవితంలో డిసెంబర్ నెల ఎంతో ప్రత్యేకంగా నిలిచింది.
రోహిత్ 2017 డిసెంబర్‌లో తొలిసారి టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టాడు. కోహ్లి గైర్హాజరీలో శ్రీలంకతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో రోహిత్ భారత జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ సిరీస్‌లో జరిగిన ఓ టీ20 మ్యాచ్‌లో రోహిత్ ఫాస్టెస్ట్ సెంచరీ(36 బంతుల్లో) సాధించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
రోహిత్ వ్యక్తిగత జీవితంలోనూ డిసెంబర్ చాలా ప్రత్యేకమైంది. 2015, డిసెంబర్ 13న రోహిత్.. రితికా సజ్దేను వివాహం చేసుకున్నాడు. అలాగే రోహిత్, రితికల కుమార్తె అదర కూడా 2018లో ఇదే నెలలో(డిసెంబర్ 30) జన్మించింది. ఇలా చాలా ఘనతలను రోహిత్ డిసెంబర్ నెల సాధించాడు. తాజాగా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమిండియా సారధ్య బాధ్యతలను చేపట్టనుండడంతో రోహిత్‌కు డిసెంబర్ మాసం చిరకాలం గుర్తుండిపోయేదిగా మారింది.
చదవండి: ఆమె నా బిగ్గెస్ట్ సపోర్ట్ సిస్టమ్.. తన వల్లే ఇదంతా: రోహిత్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment