
న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ కన్సాలిడేటెడ్ లాభం డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు, 94 శాతం తగ్గిపోయి రూ.11 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభం రూ.197 కోట్లుగా ఉంది.
ఆదాయం 20 శాతం వృద్ధితో రూ.3,589 కోట్లకు చేరింది. ప్రధానంగా మార్కెటింగ్ వ్యయాలు, వ్యూహాత్మక పెట్టుబడులు రెండు రెట్లు పెరగడం నికర లాభం తగ్గిపోయేందుకు కారణమైనట్టు సంస్థ తెలిపింది. వ్యయాలు 31 శాతం పెరిగి రూ.3,603 కోట్లుగా ఉన్నాయి. మధుర ఫ్యాషన్ అండ్ లైఫ్‌స్టయిల్ విభాగం ఆదాయం 24 శాతం పెరిగి రూ.2,466 కోట్లుగా ఉంటే, ప్యాంటలూన్స్ ఆదాయం 9 శాతం పెరిగి రూ.1,159 కోట్లుగా ఉంది. తన బ్రండెడ్ అవుట్‌లెట్లను 245 వరకు పెంచుకుంది.
Comments
Please login to add a commentAdd a comment