న్యూఢిల్లీ: బ్రాండ్ల ఆమోదయోగ్యతకు సంబంధించి గ్లోబల్ కంపెనీలకు దీటుగా దేశీ ఎల్రక్టానిక్స్ కంపెనీలు ఉంటున్నాయి. లావా, క్యూబో వంటి సంస్థలకు మెరుగైన రేటింగ్స్ లభిస్తున్నాయి. మార్కెట్ అనాలిసిస్ సంస్థ టెక్‌ఆర్క్ డిసెంబరులో నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఈ–కామర్స్ ప్లాట్‌ఫాంలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో 35 ఉత్పత్తుల కేటగిరీలవ్యాప్తంగా 25 బ్రాండ్లపై దీన్ని నిర్వహించారు.
‘రియల్‌మీ, రెడ్‌మీ వంటి గ్లోబల్ బ్రాండ్స్‌కి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో 4.3 రేటింగ్ ఉన్నట్లు మా విశ్లేషణలో వెల్లడైంది. వాటితో పోలిస్తే పరిశ్రమ ప్రమాణాలకు దాదాపు సమానస్థాయిలో లావా మొదలైన సంస్థలకు 4.2 రేటింగ్ ఉంది‘ అని నివేదిక పేర్కొంది. లావాకు 90.2 శాతం మంది అత్యధిక రేటింగ్స్ (4, 5 స్థాయిలో) ఇవ్వగా, గ్లోబల్ బ్రాండ్స్‌కి వచి్చన 4, 5 స్థాయి రేటింగ్స్ 75.8 శాతమే ఉన్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ కేటగిరీలో హీరో గ్రూప్ సంస్థ క్యూబో ఏకంగా పరిశ్రమ సగటు 4 రేటింగ్స్‌ను కూడా దాటేసి 4.1 రేటింగ్స్ దక్కించుకుంది.
అయితే, అంతర్జాతీయ సంస్థలకు అత్యధిక స్థాయిలో 4, 5 రేటింగ్స్ ఉన్నాయి. వేరబుల్ కేటగిరీల్లో మాత్రం రియల్‌మీ, రెడ్‌మీ, ఒప్పో, వన్‌ప్లస్ నార్డ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్స్‌తో పోలిస్తే భారతీయ బ్రాండ్స్‌కి పరిశ్రమ బెంచ్‌మార్క్ కన్నా తక్కువ రేటింగ్స్ ఉన్నాయి. పరిశ్రమ బెంచ్‌మార్క్ రేటింగ్స్ 4.2గా ఉండగా .. భారతీయ బ్రాండ్స్ అయిన నాయిస్, బోల్ట్ ఆడియోకి 4.1, ఆ తర్వాత బోట్..పీట్రాన్‌కు 4.0 రేటింగ్స్ లభించాయి. మివి, గిజ్‌మోర్, నంబర్‌కి సగటున 3.9 రేటింగ్ ఉంది. యాపిల్, శాంసంగ్‌ల టార్గెట్ యూజర్ల సెగ్మెంట్ భిన్నమైనది కావడంతో వాటిని ఈ అధ్యయనంలో పరిగణనలోకి తీసుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment