వారఫలాలు: 6 డిసెంబర్ నుంచి 12 డిసెంబర్, 2015 వరకు | Vaara Phalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు: 6 డిసెంబర్ నుంచి 12 డిసెంబర్, 2015 వరకు

Published Sat, Dec 5 2015 11:55 PM | Last Updated on Sun, Sep 3 2017 1:33 PM

వారఫలాలు: 6 డిసెంబర్ నుంచి 12 డిసెంబర్, 2015 వరకు

వారఫలాలు: 6 డిసెంబర్ నుంచి 12 డిసెంబర్, 2015 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవం. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు. భూ వివాదాల పరిష్కారం. కాంట్రాక్టర్లకు నూతనోత్సాహం. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కలసివచ్చే సమయం. పారిశ్రామికవేత్తలకు అరుదైన సన్మానాలు. ఎరుపు, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక ఇబ్బందులు కొంత తీరతాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రననామ పారాయణం చేయండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
మొదట్లో  ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. చాకచక్యం, నేర్పుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు ఉత్సాహవంతం. ఉద్యోగులకు హోదాలు. కళా రంగం వారికి సన్మానాలు. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
బంధువులతో కొద్దిపాటి వివాదాలు తప్పవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూ వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. వేడుకలలో పాల్గొంటారు. మీ సత్తా చాటుకుని అందర్నీ ఆకట్టుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు.

ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కే అవకాశం. పారిశ్రామికవేత్తల కృషి ఫలిస్తుంది. ఎరుపు, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆదాయం కంటే ఖర్చులు అధికం. పనుల్లో అవాంతరాలు. భూ వివాదాలు చికాకు పరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆలయ దర్శనాలు. సోదరులు, మిత్రులతో అకారణ విభేదాలు. ఇంటా బయటా చికాకులు తప్పకపోవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు స్వల్పమే. ఉద్యోగులకు పనిభారం. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. చాక్లెట్, పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీగణేశ్‌ను పూజించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. కళారంగం వారికి అవార్డులు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామ రక్షాస్తోత్రం పఠించండి.
 
తుల: (చిత్త 3,4,స్వాతి, విశాఖ1,2,3 పా.)
కార్యక్రమాలలో విజయం. పలుకుబడి పెరుగుతుంది.  వాహనాలు, భూముల కొనుగోలు. కోర్టు వ్యవహారాలు సానుకూల మవుతాయి. ఆశించిన ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. తెలుపు, లేత నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

అనుకున్న ఆదాయం సమకూరి ఇబ్బందులు తొలగుతాయి. పనుల్లో విజయం. తల్లి తరఫు వారి నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరం. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, చాక్లెట్ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
వ్యవహారాలలో పురోగతి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు పరిచయమవుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారే అవకాశం. కొత్త విద్యావకాశాలు దక్కించుకుంటారు.

వ్యాపార విస్తరణలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామిక వర్గాలకు సన్మానాలు. నీలం, నలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. పనుల్లో విజయం. పలుకుబడి పెరుగుతుంది. కాంట్రాక్టులు లభిస్తాయి. నూతన పరిచయాలు.  గృహ నిర్మాణయత్నాలు కలసి వస్తాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పరిచయాలు పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలు అభివృద్ధిదాయకం. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. కళారంగం వారికి సన్మానాలు. బంగారు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement