వారఫలాలు : 1 మే నుంచి 7మే, 2016 వరకు | Varaphalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 1 మే నుంచి 7మే, 2016 వరకు

Published Sun, May 1 2016 2:57 AM | Last Updated on Tue, Oct 16 2018 2:49 PM

వారఫలాలు : 1 మే నుంచి 7మే, 2016 వరకు - Sakshi

వారఫలాలు : 1 మే నుంచి 7మే, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. కార్యజయం. ఆశ్చర్య కరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. నూతన గృహయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. పసుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
వివాదాల నుంచి గట్టెక్కే సూచనలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రత్యేకతను చాటుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. భూములు, నగలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. స్వల్ప అనారోగ్య సూచనలు. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు మార్పులు. కళాకారులకు ప్రయత్నాలలో పురోగతి. లేత ఆకుపచ్చ, నలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కార్యోన్ముఖులై అనుకున్నది సాధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం అందుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వస్తు, వస్త్ర లాభాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు పదవులు ఊరిస్తాయి. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ఇబ్బందులు, అప్పులు చేస్తారు. ఆలోచనలు కలిసిరావు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలలో స్వల్ప ఆటంకాలు. బంధువర్గంతో వివాదాలు నెలకొంటాయి. ఇంటా బయటా ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు. పారిశ్రామిక వర్గాలకు నిరుత్సాహం. తెలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. పెట్టుబడుల్లో జాప్యం. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. గృహ నిర్మాణ యత్నాలలో కదలికలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయ వర్గాలకు పదవులు దగ్గరవుతాయి. గులాబి, ఆకాశనీలం రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా క్రమేపీ అనుకూలత ఉంటుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో విజయం. ప్రముఖులతో పరిచయాలు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు అంచనాలు నిజమవుతాయి. నీలం, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. ఆస్తి వివాదాలు. పనుల్లో అవాంతరాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక వర్గాలకు నిరాశ. వారం చివరిలో కొంత అనుకూలత ఉంటుంది. గులాబి, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన సామగ్రి, డబ్బు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. రాజకీయ వర్గాలకు పర్యటనలు వాయిదా. ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివ పంచాక్షరి పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. అనారోగ్యం. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పదు. పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. వాహన, గృహయోగాలు. తీర్థయాత్రలు చేస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగుతాయి. కళాకారులకు నూతనోత్సాహం. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఈవారం ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. అనుకున్న పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణదాతల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధువులు, పాతమిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు. పారిశ్రామిక వర్గాలకు పర్యటనలు వాయిదా. గులాబి, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement