వారఫలాలు : 28 ఫిబ్రవరి నుంచి 5 మార్చి, 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. యుక్తి, పట్టుదలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. భూ లాభాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులకు శ్రీకారం. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వాహన సౌఖ్యం. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. స్వల్ప అనారోగ్యం, ఉపశమనం. బాకీలు వసూలవుతాయి. ఉద్యోగులకు మార్పులు. రాజకీయ వర్గాలకు ఒత్తిడులు తొలగుతాయి. లేత నీలం, ముదురు ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఇంటా బయటా ప్రోత్సాహకరం. దూరమైన సన్నిహితులు దగ్గరవుతారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారుల అంచనాలు నిజమవుతాయి. తెలుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పకపోవచ్చు. ఆర్థిక పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు. అనారోగ్యం, ఔషధ సేవనం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వేత్తలకు అనుకూల సమయం. పసుపు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులలో కొద్దిపాటి జాప్యం. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి. రుణాలు సైతం తీరతాయి. ఆప్తులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగినవారితో పరిచయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగుల సమర్థత చాటుకుంటారు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, లేత పసుపు రంగులు, ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. కళాకారులకు ఒత్తిడులు. ఆకుపచ్చ, నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు దిగ్విజయంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఇంటర్వ్యూలలో విజయం. వ్యాపారాలు లాభకరం. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలకు కలిసివచ్చే కాలం. తెలుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో వివాదాలు కొంతమేర పరిష్కారం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆదాయం సంతృప్తికరం. కొన్ని సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. విద్యార్థుల యత్నాలు సఫలం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి కాగలవు. నిరుద్యోగుల యత్నాలు కలిసి వస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు చికాకులు తొలగుతాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు కొంతమేర తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పనులు చకచకా పూర్తి కాగలవు. రాబడి పెరుగుతుంది. మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వాహన, గృహయోగాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కళాకారులకు అవకాశాలు దక్కుతాయి. నీలం, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. బంధువులతో స్వల్ప వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పరపతి పెరుగుతుంది. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. నిరుద్యోగులు, విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు తప్పవు. పారిశ్రామిక వర్గాలకు నిరుత్సాహం. నలుపు, ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్న కార్యక్రమాలలో ఆటంకాలు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలిస్తుంది. బంధుమిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కుటుంబసభ్యుల సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో మార్పులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు