వారఫలాలు : 24 ఏప్రిల్ నుంచి 30ఏప్రిల్, 2016 వరకు | varaphalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు : 24 ఏప్రిల్ నుంచి 30ఏప్రిల్, 2016 వరకు

Published Sat, Apr 23 2016 10:21 PM | Last Updated on Sun, Sep 3 2017 10:35 PM

వారఫలాలు : 24 ఏప్రిల్ నుంచి 30ఏప్రిల్, 2016 వరకు

వారఫలాలు : 24 ఏప్రిల్ నుంచి 30ఏప్రిల్, 2016 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి. గతంలోని సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి ఉత్సాహవంతంగా సాగుతుంది. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు,  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. స్వల్ప అనారోగ్యం.  కాంట్రాక్టులు పొందుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు ఉత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు సన్మానాలు. నీలం, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. సన్నిహితులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు పరిష్కారవుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. జీవితాశయం నెరవేరుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. నేరేడు, లేతఎరుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షా స్తోత్రాలు పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక ప్రగతి కూడా బాగా కనిపిస్తుంది. సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి. అరుదైన ఆహ్వానాలు రాగలవు. శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనయోగం ఉంది. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు వస్తాయి. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. పసుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

ఈవారం ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగించవచ్చు. ఇంటా బయటా పని ఒత్తిడులు పెరుగుతాయి. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగులకు కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. రాజకీయ, కళారంగాల వారికి చికాకులు ఎదురవుతాయి. ఎరుపు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఈవారం పనులు కాస్త మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు కలుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొంత నిరాశ ఎదురవుతుంది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు కలిగి కంగారు పెడతాయి. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. విలువైన వార్తలు అందుతాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు సన్మానాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 పూర్వపు మిత్రుల కలయిక. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ వర్గాలకు పదవీయోగం, సన్మానాలు. ఎరుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం ఉంది. పారిశ్రామిక వర్గాలకు సంతోషకరమైన సమాచారం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
పరిచయాలు పెరుగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు పాటిస్తారు. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. కొత్త విద్యావకాశాలు దక్కుతాయి. ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. కోర్టు కేసుల నుంచి విముక్తి. అదనపు రాబడి ఉంటుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, పైస్థాయి ప్రశంసలు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. నీలం, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తోత్రాలు పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. ప్రత్యర్థులపై పట్టు సాధిస్తారు. భూములు, వాహనాలు కొంటారు. అరుదైన సన్మానాలు జరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఒక ముఖ్యసమాచారం అందుతుంది. కళాకారులకు పురస్కారాలు, అవార్డులు. నలుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆప్తులు సహాయపడతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్వల్ప అనారోగ్యం. పనులు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయ వర్గాలకు సన్మానాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement