వారఫలాలు: 29 నవంబర్ నుంచి 5 డిసెంబర్, 2015 వరకు | Varaphalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు: 29 నవంబర్ నుంచి 5 డిసెంబర్, 2015 వరకు

Published Sun, Nov 29 2015 12:46 AM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

వారఫలాలు: 29 నవంబర్ నుంచి 5 డిసెంబర్, 2015 వరకు

వారఫలాలు: 29 నవంబర్ నుంచి 5 డిసెంబర్, 2015 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
అవసరాలకు సొమ్ము అందుతుంది. ఆత్మీయులు, బంధువుల సలహాలతో ముందడుగు వేస్తారు. ఇంటిలో శుభకార్యాలు.  స్వల్ప అనారోగ్యం. విద్యార్థులు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధులలో ప్రోత్సాహం. కళారంగం వారికి నూతనోత్సాహం. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.
 
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. బంధువర్గంతో అకారణ వివాదాలు. అగ్రిమెంట్లు వాయిదా. ఆరోగ్యపరంగా చికాకులు. ముఖ్య నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక వర్గాలకు నిరుత్సాహమే.  నీలం, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.
 
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆదాయం సమకూరుతుంది. పనులలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగ లవు. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయ వర్గాలకు పదవీయోగం, సన్మానాలు. గులాబీ, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.
 
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడతారు. ఆకస్మిక ధనలాభం. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. మీ ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. శుభకార్యాలకు డబ్బు బాగా వెచ్చిస్తారు. వ్యాపారాలు లాభాలు తెచ్చి పెడతాయి. ఉద్యోగులకు విధులలో అవాంతరాలు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు లభించే అవకాశం ఉంది. తెలుపు, చాక్లెట్ రంగులు కలసి వస్తాయి. నృసింహ స్తోత్రాలు పఠించండి.
 
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పనులలో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. మీపై వచ్చిన ఆరోపణలు, అపవాదులు తొలగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగుల సేవలకు గుర్తింపు రాగలదు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. నేరేడు, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
 
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కార్యక్రమాలలో పురోగతి. పరపతి పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది.  వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళారంగం వారికి అవార్డులు రావచ్చు. ఆకుపచ్చ, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.
 
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారం. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వాహనయోగం. విద్యార్థుల యత్నాలలో పురోగతి. వ్యాపారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
 
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
రాబడి పెరిగే అవకాశం. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
 
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు కొంత నెమ్మదిస్తాయి. బంధువులు, శ్రేయోభిలాషులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు కలిసిరావు. ఇంటా బయటా నిరుత్సాహం. రావలసిన పైకం ఆలస్యమవుతుంది. వ్యాపారాల విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పని ఒత్తిడులు. కళారంగం వారికి శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
 
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. రావలసిన సొమ్ము అందుతుంది. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహన, కుటుంబసౌఖ్యం. శుభకార్యాలకు హాజరవుతారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. లేత నీలం, ఆకుపచ్చ రంగులు, ఆంజనేయ దండకం పఠించండి.
 
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
బంధువులతో విభేదాలు తొలగుతాయి. అనుకున్న కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో మంచిపేరు సంపాదిస్తారు. చిరకాల ప్రత్యర్థులు మీకు సహకరిస్తారు. ఇంటి నిర్మాణాలలో పురోగతి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒక సమస్య లేదా వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయ వర్గాలకు పదవీయోగం. తెలుపు, చాక్లెట్ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
 
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
అనుకున్నదే తడవుగా పనులు చేపట్టి పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కోర్టు వ్యవహారాలలో విజయం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశం. కళారంగం వారికి సన్మానాలు. ఎరుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గా స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement