వారఫలాలు: 27 డిసెంబర్ నుంచి 2 జనవరి, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకుంటారు. బంధువర్గంతో నెలకొన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి శ్రమాధిక్యం. ఇంటర్వ్యూలు నిరాశ కలిగిస్తాయి. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణు ధ్యానం మంచిది.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీక రిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. దూర ప్రయా ణాలు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యభంగం. వ్యాపార లావాదేవీలు సామాన్యం. ఉద్యోగులకు మార్పులు. రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. నీలం, నలుపు రంగులు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గా స్తోత్రాలు పఠించండి.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. అవసరాలకు డబ్బు సమకూరుతుంది. ఆరోగ్యభంగం. బంధువుల నుంచి ఒత్తిడులు. ఆస్తి వివాదాల పరిష్కారానికి యత్నాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో మార్పులు. రాజకీయ, కళా రంగాల వారికి విదేశీ పర్యటనల్లో మార్పులు. లేత ఆకుపచ్చ, గోధుమ రంగులు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
నూతనోత్సాహంతో ముందడుగు వేస్తారు. ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి. విందు వినోదాలు, శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రముఖులకు ఆతిథ్యం ఇస్తారు. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగ వర్గాలకు పదోన్నతి సూచనలు. పారిశ్రామిక, కళారంగాల వారికి సన్మాన సత్కారాలు. చాక్లెట్, పసుపు రంగులు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. కృష్ణ స్తోత్రాలు పఠించండి.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఎంతటి పనినైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. అందరిలోనూ మంచి గుర్తింపు లభిస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఉద్యోగ, వివాహ యత్నాలు కలసివస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారవర్గాలకు మంచి లాభాలు అందుతాయి. ఉద్యోగుల సేవలకు అధికారుల గుర్తింపు లభిస్తుంది. రాజకీయ, కళారంగాల వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. చాక్లెట్, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమ దిశ ప్రయాణాలు సానుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
హామీలు నిలుపుకుని విశ్వసనీయత చాటుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయ,కళారంగాల వారికి అరుదైన అవకాశాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులతో వివాదాల పరిష్కారం. వ్యాపార లావాదేవీలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి ఆహ్వానాలు. ఆకాశ నీలం, నలుపు రంగులు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. గులాబి, ఎరుపు రంగులు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులు కొంత మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆశయాల సాధనలో వెనుకబాటు. వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగవర్గాలకు బాధ్యతలు పెరుగుతాయి. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యభంగం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. వ్యాపారాలలో నిదానం అవసరం. ఉద్యోగులకు మార్పులు తప్పవు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. నీలం, లేత పసుపు రంగులు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్ష స్తోత్రం పఠించండి.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాల పరిష్కారమవుతాయి. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు సన్మానాలు. నలుపు, బంగారు రంగులు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వర స్తుతి మంచిది.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని సమస్యలు తీరి మనశ్శాంతి చేకూరుతుంది. విలువైన వస్తువులు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు తొలగుతాయి. గోధుమ, ఎరుపు రంగులు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు