డిసెంబర్లో వాహన విక్రయాలు డౌన్
Published Tue, Jan 10 2017 1:30 PM | Last Updated on Tue, Sep 5 2017 12:55 AM
న్యూఢిల్లీ : డిసెంబర్ నెలలో వాహన విక్రయాలు డౌన్ అయ్యాయి. 2015 డిసెంబర్ కంటే 2016 డిసెంబర్ నెలలో దేశీయంగా ప్యాసెంజర్ వెహికిల్ విక్రయాలు 1.36 శాతం పడిపోయి 2,27,824 యూనిట్లుగా నమోదయ్యాయి. గత కాలంలో ఇవి 2,30,959 యూనిట్లగా ఉన్నాయి. అదేవిధంగా దేశీయ కార్ల విక్రయాలు కూడా 8.14 శాతం పడిపోయి డిసెంబర్ నెలలో 1,58,617 యూనిట్లు అమ్ముడుపోయినట్టు దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ తెలిపింది.
మోటార్ సైకిల్ విక్రయాలు 22.5 శాతం క్షీణించి 5,61,690 యూనిట్లగా నమోదైనట్టు, టూవీలర్ వాహన అమ్మకాలు 22.04 శాతం పడిపోయి 9,10,235 యూనిట్లని పేర్కొంది. 2015 డిసెంబర్ నెలలో మోటార్ సైకిల్ విక్రయాలు 7,24,795 యూనిట్లగా, టూవీలర్ విక్రయాలు 11,67,621 యూనిట్లగా ఉన్నట్టు సియామ్ వెల్లడించింది. వాణిజ్య వాహనాల అమ్మకాలు కూడా పడిపోయినట్టు సియామ్ తెలిపింది.
Advertisement
Advertisement