న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ఈ ఏడాది డిసెంబర్‌లో 4జీ సేవలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ముందుగా పరిమిత స్థాయిలో మొదలుపెట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు తెలిపారు.
జూన్ తర్వాత 4జీ సర్వీసులను 5జీకి అప్‌గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. ‘డిసెంబర్‌లో పంజాబ్‌లో 4జీ సేవల ను ప్రారంభించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ సిద్ధంగా ఉంది. 200 సైట్లలో నెట్‌వర్క్ సిద్ధంగా ఉంది. 3,000 సైట్లను ఇన్‌స్టాల్ చేసే ప్రక్రియలో ఉన్నాం‘ అని పుర్వార్ చెప్పారు. నెట్‌వర్క్‌ను క్రమంగా నెలకు 6,000 సైట్లతో మొదలుపెట్టి ఆ తర్వాత 15,000 సైట్ల వరకు పెంచుకోనున్నట్లు తెలిపారు. మొత్తం మీద 2024 జూన్ నాటికి 4జీ విస్తరణ పూర్తి చే యాలని నిర్దేశించుకున్నట్లు పుర్వార్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment