Networks
-
డిసెంబర్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది డిసెంబర్లో 4జీ సేవలను ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ముందుగా పరిమిత స్థాయిలో మొదలుపెట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. ఇండియా మొబైల్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీఎండీ పి.కె. పుర్వార్ ఈ విషయాలు తెలిపారు. జూన్ తర్వాత 4జీ సర్వీసులను 5జీకి అప్‌గ్రేడ్ చేసే యోచనలో ఉన్నట్లు వివరించారు. ‘డిసెంబర్లో పంజాబ్‌లో 4జీ సేవల ను ప్రారంభించేందుకు బీఎస్ఎన్ఎల్ సిద్ధంగా ఉంది. 200 సైట్లలో నెట్వర్క్ సిద్ధంగా ఉంది. 3,000 సైట్లను ఇన్స్టాల్ చేసే ప్రక్రియలో ఉన్నాం‘ అని పుర్వార్ చెప్పారు. నెట్‌వర్క్‌ను క్రమంగా నెలకు 6,000 సైట్లతో మొదలుపెట్టి ఆ తర్వాత 15,000 సైట్ల వరకు పెంచుకోనున్నట్లు తెలిపారు. మొత్తం మీద 2024 జూన్ నాటికి 4జీ విస్తరణ పూర్తి చే యాలని నిర్దేశించుకున్నట్లు పుర్వార్ పేర్కొన్నారు. -
ప్రపంచంలోని టాప్ 10 అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌లు
-
టెక్ కంపెనీలకు స్పెక్ట్రం కేటాయించవద్దు
న్యూఢిల్లీ: బడా టెక్ కంపెనీలు ప్రైవేట్ 5జీ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రంను కేటాయించవద్దని కేంద్రానికి టెల్కోల సమాఖ్య సీవోఏఐ విజ్ఞప్తి చేసింది. అలా చేస్తే అవి దొడ్డిదారిన టెలికం రంగంలోకి ప్రవేశించేందుకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ‘టెల్కోలకు వర్తించే నిబంధనలు, పెనాల్టీలు వంటి బాదరబందీలేవీ బడా టెక్ కంపెనీలకు ఉండవు. క్యాప్టివ్ (సొంత అవసరాలకు) 5జీ నెట్‌వర్క్‌ల కోసం ప్రభుత్వం స్పెక్ట్రం కేటాయిస్తే.. భారత్‌లోని కంపెనీలకు 5జీ సర్వీసులు, సొల్యూషన్స్ అందించడానికి బడా టెక్నాలజీ సంస్థలకు దొడ్డిదారిన ఎంట్రీ ఇచ్చినట్లే అవుతుంది. వేలంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండా స్పెక్ట్రం కేటాయిస్తే, అన్ని సంస్థలకూ సమానంగా అవకాశాలు కల్పించాలన్న సూత్రానికి విఘాతం కలుగుతుంది‘ అని సీవోఏఐ వివరించింది. ఆదాయాలకు దెబ్బ.. ఇతరత్రా కంపెనీలు ప్రైవేట్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేస్తే టెల్కోల ఆదాయం గణనీయంగా పడిపోతుందని సీవోఏఐ డైరెక్టర్ జనరల్ ఎస్పీ కొచర్ పేర్కొన్నారు. అలాంటప్పుడు ఇక తాము ప్రత్యేకంగా 5జీ నెట్‌వర్క్‌లను ఏర్పాటు చేయడం అర్ధరహితంగా మారుతుందని తెలిపారు. టెక్ కంపెనీలు తమ ప్రైవేట్ నెట్వర్క్ కోసం టెల్కోల నుంచి స్పెక్ట్రంను లీజుకు తీసుకోవచ్చని, డిమాండ్‌ను బట్టి వాటికి నేరుగా కూడా కేటాయించే అవకాశాలను పరిశీలిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో సీవోఏఐ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 5జీ స్పెక్ట్రం కావాలనుకుంటున్న కంపెనీలు వేలంలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకోవడం సంతోషించతగ్గ విషయమని సీవోఏఐ పేర్కొంది. జులై నెలాఖరులో నిర్వహించబోయే 5జీ స్పెక్ట్రం వేలంలో అదానీ గ్రూప్ కూడా పాల్గొంటోంది. ఈ వేలంలో రూ. 4.3 లక్షల కోట్లు విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను విక్రయించనున్నారు. టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కూడా దరఖాస్తు చేసుకున్నాయి. -
ఏంటీ.. ఈ టెక్నాలజీతో రేపు ఏం జరుగుతుందో తెసుకోవచ్చా!
గతంలో ఏం జరిగింది. ప్రజెంట్ ఏం జరుగుతుందో అందరికి తెలిసిందే. అదే భవిష్యత్ లో ఖచ్చితంగా ఏం జరుగుతుందో ముందే తెలుసుకుంటే ఎలా ఉంటుంది?! ఇది కొంచెం కష్టమే అయినా దాన్ని సుసాధ్యం చేసేందుకు అమెరికా పావులు కదుపుతోంది. టెక్నాలజీని ఉపయోగించి భవిష్యత్‌లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అమెరికా రక్షణ సంస్థ పెంటగాన్ ప్రయోగాలు చేస్తోంది. గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ యుద్ధాలు జరిగే సమయంలో సైలెంట్ గా ఉండకుండా శుత్రు దేశాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఎలాంటి వ్యూహరచనలు చేస్తున్నాయి. ఇలా తదితర అంశాల గురించి తెలుసుకునేందుకు రక్షణ సంస్థ పెంటగాన్ మోడ్రన్ టెక్నాలజీ, శాటిలైట్స్, నెట్వర్క్స్ లను వినియోగించుకుంటున్నాయి. తద్వారా మిగిలిన దేశాలకంటే తామే ముందజలో ఉండాలనేది తాపత్రయం. ఇందులో భాగంగా గ్లోబల్ ఇన్ఫర్మేషన్ డామినాన్స్ ఎక్స్పెరిమెంట్స్ (gide) అనే పేరుతో ప్రయోగాలు ప్రారంభించింది. శాటిలైట్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రాడార్ల నుంచి రోజూ వచ్చే డేటాను తీసుకొని ప్రపంచం నలుమూలలా ఏం జరుగుతుందో వేగంగా కనిపెట్టేస్తుంది. టెక్నాలజీ ద్వారా వచ్చే డేటా పర్ఫెక్ట్గా ఉంటుందని, దేశం మరో దేశంపై యుద్ధానికి రెడీ అవుతుంటే ఆ వివరాల్ని అమెరికా టెక్నాలజీ గైడ్‌కి చేరవేస్తుంది. తద్వారా యుద్ధం ఎక్కడ జరుగుతుందో అమెరికా ముందే కనిపెట్టేస్తుంది. ఆ తర్వాత అంతా తన కంట్రోల్లోకి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. -
అంతా 5జీ మయం, 2024 కి ఎంత పెరుగుతుందంటే
5జీ..! హ్యూమన్ లైఫ్ స్టైల్‌ని కంప్లీట్‌గా మార్చేసుందుకు దూసుకొస్తున్న టెక్నాలజీ. ఈ టెక్నాలజీ వినియోగం రోజురోజుకు పెరగడం వల్ల 5జీ నెట్ వర్క్ సంస్థలు 2021లో 19.91 బిలియన్ డాలర్లను అర్జించినట్లు అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ రీసెర్చ్ దిగ్గజం గ్రాంటార్ డేటాను విడుదల చేసింది. 5జీ నెట్ వర్క్. ఒక్క మాటలో చెప్పాలంటే కాకులు దూరని కారడవిలో సైతం నెట్ కనెక్టివిటీ, మొబైల్ నెట్ వర్కింగ్ వ్యవస్థతో పాటు..వర్చవల్ రియాల్టీ, ఓటీటీ,ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మానవ మేధోసంపత్తితో అద్భుతాలు సృష్టించేందుకు ఉపయోగపడనుంది. అయితే దీని వల్ల దేశ భద్రత నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నా..టెక్నాలజీతో వాటన్నింటికి చెక్ పెట్టొచ్చని నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆయా సంస్థలు 5జీ టెక్నాలజీని విస్తరించే పనిలోపడ్డాయి. ముఖ్యంగా కోవిడ్-19 వల్ల యూజర్లు ఆల్ట్రా ఫాస్ట్ బ్రాండ్ బ్యాండ్ కనెక్టివిటీకి ఆప్టిమైజ్ అవ్వడంతో పాటు స్ట్రీమింగ్ వీడియోస్, ఆన్ లైన్ గేమ్స్, సోషల్ మీడియా అప్లికేషన్ల వినియోగం పెరిగిందని గ్రాంట్రార్ రీసెర్చ్ సీనియర్ ప్రిన్సిపల్ రీసెర్చ్ మైఖెల్ పొరౌస్కి తెలిపారు.5జీ వైర్లెస్ నెట్ వర్క్ ఇన్ఫ్రాస్టెక్చర్ మార్కెట్ విస్తరించడంతో పాటు..కమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ (సీఎస్పీ)తో 5జీ నెట్ వర్క్‌తో పనిచేసే ఫోన్ల వినియోగం పెరిగిందని వెల్లడించారు. దీంతో 2020 లో 5జీ నెట్ వర్క్ ఇన్ ఫ్రాస్ట్రెక్చర్ వినియోగం వల్ల వరల్డ్ వైడ్‌గా 13.7బిలియన్ల రెవెన్యూ రాగా..2021లో 39 శాతం పెరిగి 19.91 బిలియన్ డాలర్లు చేరుకున్నట్లు ఐటీ రీసెర్చ్ దిగ్గజం గ్రాంటార్ రిపోర్ట్‌లో పేర్కొంది. టైర్ 1 సిటీస్‌లో 60శాతం వినియోగం గ్రాంటర్ రిపోర్ట్ ప్రకారం.. 2020లో 10 శాతం వినియోగంలో ఉన్న సీపీసీ నెట్ వర్క్ 2024కి 60శాతం పెరుగుతుందని తేలింది. ముఖ్యంగా టైర్ 1 సిటీస్ లో ప్రస్తుతం లాంగ్ టర్మ్ ఎవెల్యూషన్ (ఎల్టీఈ) కమ్యూనికేషన్ తో వినియోగించే 4జీ నెట్ వర్క్ నుంచి 5జీ నెట్ వర్క్‌కు మార్చుకుంటారని గ్రాంటార్ రీసెర్చ్ మైఖెల్ పొరౌస్కి తెలిపారు. -
జియో కస్టమర్లకు న్యూ ఇయర్ కానుక
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారుల కోసం ఇతర్ నెట్‌వర్క్‌కు ఫ్రీ వాయిల్స్ కాల్స్‌ను మళ్లీ అందిస్తోంది. జనవరి 1, 2021 నుండి జియో మరోసారి తన నెట్‌వర్క్‌లో ఆఫ్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్‌ను ఉచితంగా చేస్తామని గురువారం ప్రకటించింది. టెలికాం రెగ్యులేటర్ ఆదేశాల ప్రకారం, జనవరి 1, 2021 నుండి దేశంలో 'బిల్ అండ్ కీప్' విధానం అమల్లోకి రానుంది. దీంతో జియో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయం ప్రకారం జియో చందారులు దేశంలోని ఏమొబైల్ నెట్‌వర్క్‌కైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ నిమిషానికి 6 పైసలు వసూలు చేసేది. దీంతో మరోసారి ప్రత్యర్థి కంపెనీలకు పోటీ తప్పదని ఎనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన రెండు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతుల ఉద్యమం ప్రభావంతో కూడా జియో ఉచిత సేవలను పునః ప్రారంభించిందని పేర్కొంటున్నారు. జియో టు జియో ఉచిత కాలింగ్ సదుపాయాలను అందిస్తున్న రిలయన్స్ జియో గత ఏడాది దేశీయంగా ఇతర నెట్‌వర్క్‌వాయిస్ కాల్స్‌కు ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయూసీ) బాదుడు షురూ చేసిన సంగతి తెలిసిందే. -
మరో టారిఫ్ వార్ : రిలయన్స్ చేతికి డెన్, హాత్వే
సాక్షి,ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోనే రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో టారిఫ్ వార్‌కు రంగం సిద్ధం చేసుకుంది. ఇప్పటికే రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రత్యర్థి కంపెనీలకు చుక్కలు చూపించింది. తాజాగా కేబుల్ రంగంలో కూడా విధ్వంసానికి రడీ అవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో చరిత్రలో అతిపెద్ద లాభాలను నమోదు చేసిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కేబుల్ టీవీ, హై స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ రంగంలో పాక్షిక పెట్టుబడులను పెట్టనున్నట్టు వెల్లడించింది. ఈ నేపథ్యంలో జియో ఎంట్రీతో కుదేలైన ఎయిర్‌టెల్‌ను, సిటీ కేబుల్ వ్యాపారాన్ని కూడా దెబ్బతీయనుంది. దేశీయంగా అతిపెద్ద కేబుల్ ఆపరేటర్ హాత్వే కేబుల్ అండ్ డేటాకామ్, డెన్ నెట్వర్క్స్ సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలను ప్రకటించింది. బ్రాడ్ బాండ్ సేవలను పెద్దయెత్తున విస్తరించే క్రమంలో ఈ పెట్టుబడులకు బుధవారం బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హాత్వే, డెన్ నెట్వర్క్ కంపెనీల్లో మెజారిటీ వాటా తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు రిలయన్స్ రూ. 5,230 కోట్లు చెల్లించనుంది. హాత్వేలో 51.3 శాతం వాటా కొనుగోలుకు రూ. 2,045 కోట్లను రిలయన్స్ చెల్లిస్తుంది. అలాగే డెన్ నెట్‌వర్క్స్‌లో 66 శాతం వాటాను కొనుగోలు చేయనుంది. ఈ డీల్ విలువ రూ. 2,045 కోట్లు. హాత్వే, డెన్ నెట్వర్స్క్ 1,100 నగరాల్లో 5 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. తాజా డీల్ ద్వారా ప్రత్యక్షంగా 20 మిలియన్ల కేబుల్ చందాదారులు రియలన్స్ అధీనంలోకి రానున్నారు. అంతేకాదు కేబుల్ మార్కెట్లో 23 శాతం వాటాను రిలయన్స్ సొంతం కానుంది. -
సోనికి ఐపీఎల్9 ఆదాయం రూ.1,200 కోట్లు
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 9వ సీజన్లో సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్(ఎస్పీఎన్) ఇండియా కంపెనీ రూ.1,200 కోట్ల ప్రకటనల ఆదాయం ఆర్జించింది. గతేడాది ఆదాయం(రూ.1,000 కోట్లు)తో పోల్చితే 20% వృద్ధి చెందింది. ప్రకటనల రేట్లు 15% పెరగడం వల్ల ఈ స్థాయి ఆదాయం సాధించామని ఎస్పీఎన్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ గుప్తా చెప్పారు. -
రాబిన్ హుడ్స్
రెప్పపాటులో నెట్లో ఎనిమిది మంది లాగిన్ అవుతున్నారు. క్షణానికి వంద కామెంట్లు పోస్టవుతున్నాయి. నిమిషానికి 31500 మంది లైకుల బైకులెక్కి నెట్ రూట్లో పరుగులు తీస్తున్నారు. ఇరవై నాలుగు గంటల్లో నెట్లో అప్ లోడ్ అవుతున్న ఫొటోలు ఏకంగా నాలుగు కోట్లు. ఒక రోజుకి గూగుల్ గోదాములో సమాచారం కోసం ‘సెర్చి’లైట్లు వేసుకుని వెతుకుతున్నవారు ఏకంగా 327 కోట్ల మంది. ఆకలి తీరడమే అసలైన స్వాతంత్య్రం ఆగస్టు పధ్నాలుగు పాకిస్తాన్ పుట్టిన రోజు. ఆగస్టు పదిహేను భారత్ పుట్టిన రోజు. ఢిల్లీ - ఇస్లామాబాద్‌లలో నేతలు జెండాలు ఎగరేశారు. వాగా - అటారీ వద్ద కొందరు కొవ్వొత్తులు వెలిగించారు. అటూ ఇటూ జవాన్లు తూటాల సాయంతో మాట్లాడుకున్నారు. కానీ రాబిన్ హుడ్ ఆర్మీ అనే సంస్థకు చెందిన కొందరు యువతీయువకులు మాత్రం కొత్తగా థింక్ చేశారు. ఇరవై ఏళ్ల వయసు దాటని వీరంతా ఈ రెండు రోజుల్లో లక్ష మంది అన్నార్తులకు అన్నం పెట్టాలని నిర్ణయించుకున్నారు. భారత్‌లో ముంబాయి, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, పుణే ఇంకా చాలా నగరాల్లో ఆకలిపై యుద్ధం ప్రకటిస్తే, పాకిస్తానీ కుర్రాళ్లు కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌లో అన్నం పెట్టారు. ఎజెండాలు, ఏ జెండాలూ లేని వీళ్లంతా ఆకలి తీరడమే అసలైన స్వతంత్రమని ప్రకటించారు. రాబిన్ హుడ్ ఆర్మీ పిక్ పేరిట తమ సేవాకార్యక్రమాల ఫోటోలను పెట్టి సమైక్యతా సందేశం వినిపించారు. ఒక్క అడుగు... ఒక్క అడుగు... ఆంజనేయుడు సంజీవని పర్వతం కోసం ఎక్కడెక్కడికి వెళ్లాడో తెలుసా? ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షి, బెంగుళూరులోని భీమన హెజ్జె, శ్రీలంక, థాయ్‌లాండ్, మలేషియా, సౌతాఫ్రికా, టెక్సాస్, ఓహాయో, అలాస్కా, కెనడా, సిరియాలోని ఐన్ దారా మందిరం, బోట్స్వానా, ఆస్ట్రేలియా, బెలిజీ, స్పెయిన్, పెరాగ్వే, రష్యాలకు వెళ్లాడట. అబద్ధం అనుకుంటున్నారా... ఈ ప్రదేశాలన్నిటా పెద్దపెద్ద పాద ముద్రలున్నాయట. అవి ఆంజనేయుడివేనట. కావాలంటే వెళ్లి చూడండి. లేకపోతే www.talkpundit.com చూడండి. శాస్త్రవేత్తల లెక్క ప్రకారం ఇవి రెండు వందల మిలియన్ల సంవత్సరాల నాటివట. అన్నట్టు అమెరికాలోని టాహో చెరువు వద్ద ఆంజనేయుడు షూస్ కూడా వేసుకున్నట్టున్నాడు. జాగ్రత్తగా గమనించండి. అమ్మ వంటిది అమ్మ ఒక్కటే! ఓ బిడ్డ పుట్టిందంటే తల్లి మరోసారి పుట్టినట్టే. కొత్త ప్రాణి జననం కోసం దాదాపు మరణం అంచులకు వెళ్లాల్సిందే. మరణం శ్మశాన వైరాగ్యాన్నిస్తే జననం ప్రసూతి వైరాగ్యాన్ని ఇస్తుంది. సిజేరియన్ చేయించుకుని బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లిని హెలెన్ కార్మినా అనే ఓ ఫోటోగ్రాఫర్ ఫొటో తీసింది. ప్రాణాలకు తెగించి, ప్రాణం పోసే అమ్మదనానికి, కళాత్మకత అనే కమ్మదనం జోడించింది ఈ ఫోటో. లక్షల మంది చూశారు. వేల మంది లైక్ చేశారు. మీరూ చూడండి. వందే మాతరం అనండి!!! ఆఫీసే ఐపీఎల్... అడుగడుగునా చీర్ గర్ల్స్ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’లో పొలం దున్నేందుకు ఎడ్లు మొరాయిస్తే మన హీరో సిద్ధార్థ ఏం చేశాడు? ఓ అందమైన, అలంకరించిన ఆవును ముందు నడిపించాడు. ఇక ఎడ్లకు ఎక్కడ లేని ఊపు వచ్చేసింది. పొలమంతా దున్నేసింది. చైనా వాడెవడో ఈ సినిమాను చూసేసినట్టున్నాడు. తమ దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలో ఉత్పాదకతను పెంచేందుకు ఇదే ఫార్ములాను అమలు చేస్తున్నాడు. ఉద్యోగులకు ఊపు, ఉత్సాహం, ఊరట ఉంటే కానీ ఉత్పాదకత పెరగదని గుర్తించాడు. అందుకే అందమైన చీర్ గర్ల్స్ను రంగంలోకి దింపాడు. ఆగండాగండి... ఐపీఎల్ తరహా చీర్ గర్ల్స్ కాదు. వీళ్లు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కొనిపిస్తారు. కొసరి కొసరి తినిపిస్తారు. పని పూర్తి చేస్తే మెచ్చుకుంటారు. సాయంత్రం కాస్సేపు పింగ్ పాంగ్ (మన టేబుల్ టెన్నిస్) ఆడిస్తారు. దీంతో సదరు కంపెనీల్లో ఉత్పాదకత బాగా పెరుగుతోందని చెబుతున్నారు. అంతా బాగుంది కానీ... ఈ సదుపాయం అబ్బాయిలకేనా? వై షుడ్ బాయ్స్ హావ్ ఆల్ ద ఫన్? కనిపెంచిన నాన్నకు అమ్మ అయింది తండ్రి ఆమెకు కెమెరాను ప్రేమించడం నేర్పించాడు. కొన్నాళ్లకు ఆ తండ్రి మాయమైపోయాడు. ఎక్కడికి పోయాడో తెలియదు. ఆమె పెరిగి పెద్దదైంది. 2003 నుంచీ ఆమె పేవ్‌మెంట్‌పై బతుకు గడిపేవారి జీవితాలను డాక్యుమెంట్ చేసే ప్రాజెక్టును చేపట్టింది. 2012లో ఓ హోటల్ ముందు, చిరిగిన బట్టలతో, మాసిన జుత్తుతో, ఎముకల పోగై, మురికికి మారుపేరులా ఉన్న ఓ మనిషి నిలుచుని కనిపించాడు. ఎందుకో ఆ అమ్మాయి కాళ్లు ఆగిపోయాయి. కళ్లు అతడిని జాగ్రత్తగా చూశాయి. గుండె ఉన్నట్టుండి గొంతులోకి ఎగిసి వచ్చింది. క్షణం ఊపిరాగిపోయింది. ఆయన తన నాన్నే. అయితే ఆయనకు మతి స్థిమితం లేదు. మనుషుల్ని గుర్తుపట్టడం లేదు. అప్పట్నుంచీ ఆమెది ఒకే ధ్యాస, ఒకే ధ్యానం. ఆయనను దక్కించుకునేందుకు అహరహం శ్రమించింది. కని పెంచిన నాన్నకు తానే అమ్మ అయింది. ఆఖరికి ఆయన మామూలు మనిషయ్యాడు. మళ్లీ కెమెరా పట్టాడు. హనోలులుకి చెందిన డయానా కిమ్ కథ ఇది. అద్భుతాలు సాధ్యమేననిపించే ఈ కథ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. అంత అందం నీటి పాలేనా? ఈ మోడల్స్‌కి జలస్తంభన విద్య తెలుసా? గాజు గోడల స్విమ్మింగ్ పూల్‌లో చటుక్కున దూకి సాగర కన్యల్లా విన్యాసాలు చేస్తూ అందర్నీ విస్తుపోయేలా చేస్తున్నారు. సాగర కన్యలు ఇక్కడున్నారు. ఇక సాహస వీరులైపోదామా అనుకునేలా చేస్తున్నారు. యానా నెడ్జ్ వెట్ స్కయా అనే ఫ్యాషన్ డిజైనర్ ఏడాది క్రితం చేసిన ఈ జబర్దస్త్ జల ఫ్యాషన్ షో ఇప్పటికీ నెట్ సాగరంలో ఈదులాడేస్తోంది. 14 లక్షల మంది ఇప్పటికే చూశారు. మీరూ చూడండి.