సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారుల కోసం ఇతర్ నెట్‌వర్క్‌కు ఫ్రీ వాయిల్స్ కాల్స్‌ను మళ్లీ అందిస్తోంది. జనవరి 1, 2021 నుండి జియో మరోసారి తన నెట్‌వర్క్‌లో ఆఫ్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్‌ను ఉచితంగా చేస్తామని గురువారం ప్రకటించింది. టెలికాం రెగ్యులేటర్ ఆదేశాల ప్రకారం, జనవరి 1, 2021 నుండి దేశంలో 'బిల్ అండ్ కీప్' విధానం అమల్లోకి రానుంది. దీంతో జియో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
ఈ నిర్ణయం ప్రకారం జియో చందారులు దేశంలోని ఏమొబైల్ నెట్‌వర్క్‌కైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ నిమిషానికి 6 పైసలు వసూలు చేసేది. దీంతో మరోసారి ప్రత్యర్థి కంపెనీలకు పోటీ తప్పదని ఎనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన రెండు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతుల ఉద్యమం ప్రభావంతో కూడా జియో ఉచిత సేవలను పునః ప్రారంభించిందని పేర్కొంటున్నారు. జియో టు జియో ఉచిత కాలింగ్ సదుపాయాలను అందిస్తున్న రిలయన్స్ జియో గత ఏడాది దేశీయంగా ఇతర నెట్‌వర్క్‌వాయిస్ కాల్స్‌కు ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయూసీ) బాదుడు షురూ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment