free voice calls
-
జియో కస్టమర్లకు న్యూ ఇయర్ కానుక
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. తన వినియోగదారుల కోసం ఇతర్ నెట్‌వర్క్‌కు ఫ్రీ వాయిల్స్ కాల్స్‌ను మళ్లీ అందిస్తోంది. జనవరి 1, 2021 నుండి జియో మరోసారి తన నెట్‌వర్క్‌లో ఆఫ్-నెట్ డొమెస్టిక్ వాయిస్ కాల్స్‌ను ఉచితంగా చేస్తామని గురువారం ప్రకటించింది. టెలికాం రెగ్యులేటర్ ఆదేశాల ప్రకారం, జనవరి 1, 2021 నుండి దేశంలో 'బిల్ అండ్ కీప్' విధానం అమల్లోకి రానుంది. దీంతో జియో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిర్ణయం ప్రకారం జియో చందారులు దేశంలోని ఏమొబైల్ నెట్‌వర్క్‌కైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ నిమిషానికి 6 పైసలు వసూలు చేసేది. దీంతో మరోసారి ప్రత్యర్థి కంపెనీలకు పోటీ తప్పదని ఎనలిస్టులు భావిస్తున్నారు. మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన రెండు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధానిలో రైతుల ఉద్యమం ప్రభావంతో కూడా జియో ఉచిత సేవలను పునః ప్రారంభించిందని పేర్కొంటున్నారు. జియో టు జియో ఉచిత కాలింగ్ సదుపాయాలను అందిస్తున్న రిలయన్స్ జియో గత ఏడాది దేశీయంగా ఇతర నెట్‌వర్క్‌వాయిస్ కాల్స్‌కు ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయూసీ) బాదుడు షురూ చేసిన సంగతి తెలిసిందే. -
జియో కస్టమర్లకు శుభవార్త
ముంబయి : రిలయన్స్ జియో కస్టమర్లకు మరో శుభవార్త. వైఫై ద్వారా వాయిస్, వీడియో కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు రిలయన్స్ జియో బుధవారం ప్రకటించింది. దీనికి అధనంగా ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. భారతదేశంలో ఉన్న ఏ వైఫై నెట్‌వర్క్‌లో అయినా ఈ సర్వీస్ పనిచేయనుంది. ప్రసుత్తం 150 రకాల స్మార్ట్ ఫోన్లలో వైఫై ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. వైఫై కాలింగ్ సౌలభ్యం దేశ వ్యాప్తంగా జనవరి 7 నుంచి 16 మధ్యలో అందుబాటులోకి రానుంది. అయితే మీ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై కాలింగ్ సపోర్ట్ చేస్తుందో లేదో తెలుసుకునేందుకు jio.com వెబ్సైట్లో చూసుకోవచ్చు. జియో వైఫై కాలింగ్ ఉపయోగించాలంటే స్మార్ట్ఫోన్లలో కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంతకు ముందు భారతీ ఎయిర్టెల్ ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ' ఎయిర్టెల్ వైఫై కాలింగ్' పేరుతో సదుపాయాన్ని కల్పించింది. తాజాగా జియో మాత్రం ఉచిత వైఫై కాలింగ్ సదుపాయాన్ని పాన్ ఇండిలో కల్పించనుంది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్ : ప్రత్యేకత అదే!
టెలికాం రంగంలో నెలకొన్న తీవ్రమైన పోటీకర వాతావరణంలో, ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ మరో సరికొత్త ప్లాన్‌ను తన కస్టమర్ల ముందుకు తీసుకొచ్చింది. అపరిమిత డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్‌ను 84 రోజుల పాటు ఉచితంగా అందించేందుకు రూ.1,099 ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఆఫర్ కేవలం తన ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ''స్పీడు పరిమితి లేకుండా అపరిమిత డేటా'' అందించడం ఈ ప్లాన్ ప్రత్యేకత. రూ.1,099 ప్లాన్ గురించి తెలుసుకోవాల్సిన వివరాలు.. వాయిస్ కాల్స్ : ఈ రూ.1,099 ప్రీపెయిడ్ డేటా రీఛార్జ్ ఓచర్ కింద అపరిమిత కాల్స్‌ను బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేస్తోంది. హోమ్ సర్కిల్‌కు, నేషనల్ రోమింగ్‌కు ఈ కాల్స్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. రూ.1,099 ప్రీపెయిడ్ డేటా ఓచర్లో 84 రోజుల పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా అందించనుంది. అంటే వాలిడిటీ పిరియడ్ అయిపోయేంత వరకు రోజుకు 100 ఎస్ఎంఎస్లను సబ్స్క్రైబర్లు పంపించుకోవచ్చు. 84 రోజుల తర్వాత డేటా వాడకంపై యూజర్లకు 10 కేబీ డేటాకు 3 పైసల ఛార్జీ విధించనుంది. రూ.1,099 రీఛార్జ్ ప్యాక్‌లో పీఆర్బీటీ(పర్సనలైజడ్ రింగ్ బ్యాక్ టోన్ ఫెసిలిటీ) అందుబాటులో ఉంది. బీఎస్ఎన్ఎల్ ఆఫర్ చేసే ఈ స్పెషల్ సర్వీసు ద్వారా డిఫాల్ట్ రింగ్‌నే కాకుండా యూజర్లు సరికొత్త ట్యూన్‌ను సెట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రిలయన్స్ జియో వంటి ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వనుందని కంపెనీ చెబుతోంది. -
రిలయన్స్ జియోకు ట్రాయ్ షాక్
న్యూఢిల్లీ : ఉచిత వాయిస్ కాల్ ఆఫర్లపై వివరణ ఇవ్వాల్సిందేనని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు షాకిచ్చింది. రెగ్యులేటరీకి సమర్పించిన నివేదికలో వాయిస్ టారిఫ్ ప్లాన్ నిమిషానికి 1.20పైసలుండగా.. ఉచిత కాలింగ్ ఆఫర్‌ను ఎలా అందిస్తాన్నారో తెలుపాల్సిందేనని ట్రాయ్ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఈ రెండింటికీ చాలా తేడా ఉన్నట్టు దీనిపై వివరణ కావాలంటూ ట్రాయ్ కోరినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంపై సీనియర్ ట్రాయ్ అధికారులు, రిలయన్స్ జియో ఎగ్జిక్యూటివ్‌లతో భేటీ అయినట్టు తెలిపాయి. కంపెనీ అందించే టారిఫ్ ప్లాన్ వివరాలు కోరినట్టు, ఈ విషయంపై ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నట్టు చెప్పాయి. కాల్ ప్లాన్ కింద రెగ్యులేటరీ ఫైలింగ్‌లో సెకనుకు 2 పైసలు చార్జ్ చేస్తామని రిలయన్స్ జియో తెలిపింది. అంటే నిమిషానికి 1.20 పైసలన్నమాట. సిమ్ కార్డ్ బ్రోచర్స్పైనే కూడా కస్టమర్లకు ఇదే కనిపిస్తుంది. అయితే ఉచిత కాల్స్ ప్రకటనకు, రెగ్యులేటరీ సమర్పణకు టారిఫ్ ప్లాన్స్‌లో తేడాపై రిలయన్స్ జియో స్పందించడంలేదు. దీనిపై కంపెనీ దగ్గర ఎలాంటి సమాధానం లేదని పలు టెలికాం కంపెనీలు ఆరోపిస్తున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు 2004లో టెలికాం రెగ్యులేటరీ తయారుచేసిన టెలికాం టారిఫ్ ప్లాన్‌ను సైతం రిలయన్స్ జియో సవరించనుందని తెలుస్తోంది. ఈ టారిఫ్ ఫ్లాన్ ప్రకారం టెలికాం కంపెనీలు ఇంటర్‌కనెక్ట్ యూజర్ చార్జీల(ఐయూసీ) కంటే తక్కువగా టారిఫ్‌లు ఉండటానికి ఇష్టపడవు. ప్రస్తుతం ఐయూసీ రేట్ నిమిషానికి 14 పైసలుగా ఉంది. ఉచిత వాయిస్ కాల్స్ ఆఫర్స్‌తో రిలయన్స్ జియో దోపిడీ పద్ధతులకు తెరతీసిందని ఇతర టెలికాం కంపెనీలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. -
వాట్సప్ నుంచి త్వరలో ఉచిత వాయిస్ కాల్స్!
స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు శుభవార్త. యూజర్లు అత్యధికంగా వాడుతున్న వాట్పప్ త్వరలోనే ఫ్రీ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను అందించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 60 కోట్లమంది యూజర్లకు ఇది ఉపయోగపడుతుందని అంచనా. వాట్పస్ ఇంటర్ఫేస్ను తాజాగా మార్చడంతో త్వరలోనే వాయిస్ కాలింగ్ కూడా రాబోతోందని తెలుస్తోంది. యూజర్ ఇంటర్ఫేస్ను మారుస్తున్నారని, దానికి సంబంధించిన ఇమేజిలు లీకయ్యాయని, వాటిని బట్టి చూస్తుంటే త్వరలోనే వాట్పస్ నుంచి కాల్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోందని సాంకేతిక విషయాలను అందించే వెబ్సైట్లు తెలియజేశాయి. అలాగే వాట్సప్ తాజా వెర్షన్లో ట్రాన్స్లేషన్ సదుపాయం కూడా కనిపిస్తోంది. ఇటీవలే వాట్పప్‌ను ఫేస్బుక్ కొనుగోలు చేస్తోందన్న వార్తలు వచ్చిన తర్వాత వాట్సప్‌ను వినియోగించే వారి సంఖ్య 15 శాతం పెరిగింది. కేవలం భారతదేశంలోనే దాదాపు 5 కోట్లమంది యూజర్లు వాట్సప్‌ను ఉపయోగిస్తున్నారు.