వాట్సప్ నుంచి త్వరలో ఉచిత వాయిస్ కాల్స్!
స్మార్ట్ఫోన్ వినియోగదారులకు శుభవార్త. యూజర్లు అత్యధికంగా వాడుతున్న వాట్పప్ త్వరలోనే ఫ్రీ వాయిస్ కాలింగ్ ఫీచర్ను అందించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 60 కోట్లమంది యూజర్లకు ఇది ఉపయోగపడుతుందని అంచనా. వాట్పస్ ఇంటర్ఫేస్ను తాజాగా మార్చడంతో త్వరలోనే వాయిస్ కాలింగ్ కూడా రాబోతోందని తెలుస్తోంది.
యూజర్ ఇంటర్ఫేస్ను మారుస్తున్నారని, దానికి సంబంధించిన ఇమేజిలు లీకయ్యాయని, వాటిని బట్టి చూస్తుంటే త్వరలోనే వాట్పస్ నుంచి కాల్స్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తోందని సాంకేతిక విషయాలను అందించే వెబ్సైట్లు తెలియజేశాయి. అలాగే వాట్సప్ తాజా వెర్షన్లో ట్రాన్స్లేషన్ సదుపాయం కూడా కనిపిస్తోంది. ఇటీవలే వాట్పప్ను ఫేస్బుక్ కొనుగోలు చేస్తోందన్న వార్తలు వచ్చిన తర్వాత వాట్సప్ను వినియోగించే వారి సంఖ్య 15 శాతం పెరిగింది. కేవలం భారతదేశంలోనే దాదాపు 5 కోట్లమంది యూజర్లు వాట్సప్ను ఉపయోగిస్తున్నారు.