
వాట్సాప్ యూజర్లకు బిగ్ అలర్ట్. జనవరి 1, 2023 నుంచి పలు స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ పని చేయదు. ఎందుకంటే.. వాట్సాప్ తన వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంలో భాగంగా యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడంతో పాటు బగ్‌లను ఫిక్స్ చేసేందుకు ప్రతి వారం యాప్ అప్‌డేట్‌లను విడుదల చేస్తుంది.
మెటా యాజమాన్యంలోని ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లేదా వెబ్‌కు అనుగుణంగా తాజా సిస్టమ్ సాఫ్ట్‌వేర్‌లకు సపోర్ట్‌లను అందించేందకు వాటికి అనుగుణంగా అప్‌డేట్‌లను లాంచ్ చేస్తుంది.
ఈ కారణంగా, ప్రతి సంవత్సరం కొత్త అప్‌డేట్‌లపై దృష్టి పెట్టేందుకు పాత ఆపరేటింగ్ వెర్షన్‌లకు తన సపోర్ట్‌ని నిలిపివేస్తుంది. ఇదే తరహాలో ఈ సంవత్సరం కూడా, కొన్ని ఆండ్రాయిడ్, ఐఫోన్ మోడల్‌లతో సహా పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లతో పని చేస్తున్న దాదాపు 49 స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌కు సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది వాట్సాప్.
ఈ మోడల్‌లో పని చేయదు.. ఇలా చేయాల్సిందే!
పాత ఐఫోన్ మోడల్‌లో పని చేయదు. కనుక ఈ మోడల్‌ను ఉపయెగిస్తున్న వారు తమ హ్యాండ్‌సెట్‌లను iOS 12 లేదా కొత్తదానికి అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఆండ్రాయిడ్ వాడుతున్న వినియోగదారులు వాట్సాప్ ఉపయోగించాలంటే Android OS 4.1 లేదా తర్వాత వెర్షన్‌లోకి మారాల్సి ఉంటుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్, భద్రతాపరమైన లోపాల వల్ల యూజర్లు ఈ మార్పును సహకరించాలని వాట్సాప్ కోరింది.
నివేదిక ప్రకారం iOS 11, Android OS 4.. అంతకంటే పాత ఓఎస్ మొబైల్ ఫోన్ లకు డిసెంబర్ 31 తర్వాత వాట్సాప్ తన సపోర్ట్‌ను ఆపివేయనుంది. గడువు ముగిసిన హ్యాండ్‌సెట్‌ల జాబితాలో Apple, Samsung, LG, Huawei, ఇతర కంపెనీలకు చెందిన 49 స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. ఆ జాబితాలో ఉన్న ఫోన్లు ఇవే.. ఐఫోన్ 5, ఐఫోన్ 5సీ,
చదవండి: అలర్ట్: ఆధార్ కార్డ్ వినియోగంపై కీలక మార్గదర్శకాలు విడుదల!
Comments
Please login to add a commentAdd a comment