ముంబై: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రిలయన్స్ జియో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఐదు నెలల పాటు ఉచిత 4జీ డేటా, జియో-జియో ఫ్రీ ఫోన్ కాల్స్‌ను ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇది జియోఫై 4జీ వైర్ లెస్ హాట్‌స్పాట్ ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుంది. జియోఫై రూ.1,999లకు జియో స్టోర్‌లో కానీ, ఆన్‌లైన్‌లో కానీ లభిస్తుంది. అది కొన్న తరువాత జియోఫైకి సంబంధించిన ప్లాన్లలో ఏదో ఒక దానితో సిమ్‌ను యాక్టివేట్ చేయించుకోవాలి. ఒకసారి సిమ్ యాక్టివేట్ అయిన తరువాత దానిని జియోఫైలో వేసి ఉపయోగించుకోవచ్చు. సిమ్ యాక్టివేట్ అయ్యిందో లేదో అన్న విషయాన్ని మై జియో యాప్‌లో చెక్ చేసుకోవచ్చు.
రూ. 199, రూ 249, రూ. 349 ఆఫర్లతో సిమ్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. వీటిలో అత్యంత చౌకైన ఆఫర్ రూ. 199, దీని ద్వారా 28 రోజుల వాలిడిటితో ప్రతిరోజూ 1.5GB డేటాను పొందవచ్చు. దీనికి అదనంగా జియో ప్రైమ్ సభ్యత్వం పొందటానికి రూ.99లో రిచార్జ్ చేయించుకుంటే 28 రోజులకు ప్రతిరోజూ 1.5 జీబీ డేటా, అపరిమిత జియో- జియో కాల్స్, 1000 జియో నుంచి ఇతర మొబైల్ నెట్‌వర్క్ నిమిషాలు, 140 రోజుల పాటు రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు.
రెండవ ఆఫర్ రూ. 249, ఇది 28 రోజుల పాటు ప్రతిరోజూ 2GB డేటాను అందిస్తుంది. ఇక్కడ కూడా మీరు అదనంగా రూ. జియో ప్రైమ్ సభ్యత్వానికి 99 రీఛార్జ్ చేయిస్తే రోజుకు 2 జీబీ డేటా, అపరిమిత జియో-జియో కాల్స్, 28 రోజుల పాటు 1000 జియో నుంచి ఇతర మొబైల్ నెట్‌వర్క్ నిమిషాలు, 112 రోజుల పాటు రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్‌లను పొందవచ్చు. మూడవ ఆప్షన్ రూ. 349, ఇది మీకు 28 రోజుల పాటు ప్రతిరోజూ 3జీబీ డేటాను అందిస్తుంది. రూ. 99 అదనపు, జియో ప్రైమ్ సభ్యత్వంతో 28 రోజుల పాటు మీకు రోజుకు 3 జీబీ డేటా, అపరిమిత జియో-జియో కాల్స్, 1,000 నిమిషాల జియో - ఇతర మొబైల్ నెట్‌వర్క్ కాల్స్, 84 రోజుల పాటు రోజుకు 100 జాతీయ ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి.
చదవండి: అంబానీ సంచలన నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment