
హీరోయిన్ కీర్తి సురేశ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుందా? అంటే అవుననే అంటోది కోలీవుడ్ మీడియా.

తెలుగు, తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న కీర్తి.. త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతోందట.

డిసెంబర్‌లో కీర్తి సురేశ్ పెళ్లి చేసుకోబోతుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

కీర్తి సురేశ్‌ది ప్రేమ వివాహం కాకుండా.. పెద్దలు కుదిర్చిన సంబంధం. పెళ్లి కొడుకు కీర్తి సురేశ్‌కి ఫ్యామిలీకి బాగా తెలిసివాడేనట.

ఈ ఏడాది డిసెంబర్ రెండోవారంలో గోవాలో కీర్తి సురేశ్ పెళ్లి జరగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది.

కీర్తి సురేశ్ పెళ్లిపై రూమర్స్ రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు పెళ్లి పుకార్లు వచ్చాయి.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌తో కీర్తి సురేశ్ ప్రేమలో పడినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే కీర్తి సురేశ్ పేరెంట్స్ వాటిని ఖండించారు.
















