ఆగస్టులో ద్రవ్యోల్బణం 3.65%
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండవ నెల ఆగస్టులో కూడా పూర్తి అదుపులో ఉంది. ధరల స్పీడ్ 3.65%గా (2023 ఇదే నెలతో పోల్చితే) నమోదైంది. అయితే నెలవారీగా 2024 జూలై (ఐదేళ్ల కనిష్ట స్థాయి 3.6%)తో పోలి్చతే స్వల్పంగా పెరగడం గమనార్హం.
జాతీయ గణాంకాల కార్యాలయం విడుదల చేసిన సమాచారం ప్రకారం... సూచీలోని ఫుడ్ బాస్కెట్ విభాగంలో ధరల స్పీడ్ ఆగస్టులో 5.66 శాతంగా ఉంది. జూలైలో ఈ రేటు 5.42 శాతం. ఒక్క కూరగాయలు చూస్తే, ద్రవ్యోల్బణం 10.71 శాతంగా ఉంది. కాగా, అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. అప్పటి వరకూ రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే దిగువస్థాయి ధోరణిలో కొనసాగితే ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించే అవకాశాలు ఉన్నాయన్నది నిపుణుల అంచనా.
పరిశ్రమలు పేలవం...
పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) 2024 జూలైలో పేలవ పనితీరును ప్రదర్శించింది. వృద్ధి రేటు కేవలం 4.8%గా నమోదైంది. తయారీ, మైనింగ్ రంగాల పేలవ పనితీరు దీనికి నేపథ్యం. 2023 జూలై ఈ వృద్ధి రేటు 6.2%. ఇక ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో ఐఐపీ వృద్ధి స్వల్పంగా 5.2%కి పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment