న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 5 శాతం దిగువనే కొనసాగింది. సూచీ సమీక్షానెల్లో 4.83 శాతంగా నమోదయ్యింది. మార్చిలో నమోదయిన 4.85 శాతంతో పోలి్చతే స్వల్పంగా తగ్గింది. ఇది 11 నెలల కనిష్ట స్థాయి.
అయితే 2023 ఇదే నెలతో పోల్చితే (4.7 శాతం) అధికంగా ఉంది. నెలవారీగా చూస్తే, ఒక్క ఆహార ద్రవ్యోల్బణం 8.52 శాతం (2024 మార్చి) నుంచి 8.70 శాతానికి పెరిగింది. ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ 2తో 4 శాతంగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment