vegetable price rise
-
కూరగాయలు భగ్గు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూన్లో ‘యూ’టర్న్ తీసుకుంది. పదకొండు నెలలుగా మెట్లు దిగివస్తూ, 2024 మేలో 4.8 శాతానికి చేరిన రిటైల్ ద్రవ్యోల్బణం, జూన్లో 28 బేసిస్ పాయింట్లు పెరిగి (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) 5.08 శాతానికి (2023 జూన్తో పోల్చి) చేరింది. అంతక్రితం గడిచిన నాలుగు నెలల్లో ఇంత తీవ్ర స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం నెలకొనడం ఇదే తొలిసారి. ఆహారం ప్రత్యేకించి కూరగాయల ధరల తీవ్రత దీనికి ప్రధాన కారణం. రిటైల్ ద్రవ్యోల్బణంలో కీలక విభాగమైన ఆహార విభాగంలో ద్రవ్యోల్బణం 9.36%గా ఉంది. మేలో ఈ రేటు 8.69%. కూరగాయల ధరలు భారీగా 29.32% పెరిగాయి. పప్పు దినుసుల ధరలు 16.07 శాతంగా నమోదయ్యాయి. ధరల పెరుగుదల నేపథ్యంలో ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలు సన్నగిల్లాయి. -
అక్కడున్న ధరలను కాస్త దించమని అడిగా..!
అక్కడున్న ధరలను కాస్త దించమని అడిగా..! -
శ్రావణమాసం ఎఫెక్ట్.. భగ్గుమంటున్న కూరగాయల ధరలు
సాక్షి, ముంబై: శ్రావణ మాసం ప్రారంభం కావడంతో కూరగాయలు, పండ్లు, ఫలాల ధరలకు రెక్కలు వచ్చాయి. ఒక్కసారిగా డిమాండ్ పెరగడంతో కూరగాయల ధరలు 40 శాతం, ఫలాల ధరలు 20 శాతం మేర పెరిగిపోయాయి. శ్రావణ మాసంలో అధిక శాతం కుటుంబాలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాసలుంటాయి. మాంసాహారానికి, మద్యానికి దూరంగా ఉంటారు. దీంతో శ్రావణ మాసంలో కోడి, మేక మాంసాలకు డిమాండ్ పడిపోతుంది. సాధారణంగా ఉపవాసాలుండే ఈ కుటుంబాల్లో పురుషులు మద్యం కూడా ముట్టుకోరు. అదేవిధంగా ప్రతీ సోమ, శుక్రవారాల్లో ఉపవాసాలు, పూజల కారణంగా పండ్లు, ఫలాలకు డిమాండ్ పెరిగిపోతుంది. దీంతో కోడి గుడ్లు, మేక, కోడి మాంసం ధరలు పడిపోతాయి. కాని ఏటా శ్రావణ మాసంలో కూరగాయలు, పండ్లు, ఫలాల ధరలు అమాంతం చుక్కలను తాకుతాయి. శ్రావణ మాసం ప్రారంభానికి ముందు ఏపీఎంసీలోకి 2,586 టన్నుల కూరగాయలు వచ్చేవి. ఇప్పుడు 3,815 టన్నులు వస్తున్నాయి. దీన్ని బట్టి శ్రావణ మాసంలో కూరగాయాలకు ఏ స్ధాయిలో డిమాండ్ ఉందో తెలుస్తోంది. ఏటా శ్రావణ మాసం ప్రారంభం కాగానే కూరగాయలకు ఒక్కసారిగా డిమాండ్ పెరుగుతుంది. దీంతో వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ)లోకి కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య పెరుగుతుంది. కాని ఈ ఏడాది జూలైలో భారీగా కురిసిన వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రోడ్లన్నీ కోతకు గురై పాడైపోయాయి. వంతెనలు కూలిపోవడంతో రవాణ స్తంభించిపోయింది. పండించిన పంటలు కూడా నీటిపాలయ్యాయి. కొన్నిచోట్ల ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో ట్రక్కుల్లో ఉన్న సరుకులు కుళ్లిపోయి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. వీటికితోడు తరుచూ ఇంధనం ధరలు పెరుగుతున్నాయి. మరోపక్క ఏపీఎంసీలోకి కూరగాయల లోడుతో వచ్చే ట్రక్కులు, టెంపోల సంఖ్య తగ్గిపోయింది. దీంతో డిమాండ్ ఎక్కువ, సరుకుల రవాణా తక్కువ అనే పరిస్ధితి నెలకొంది. ఫలితంగా కూరగాయల ధరలు హోల్సేల్ మార్కెట్లో 10–20 శాతం పెరగ్గా, రిటైల్ వ్యాపారులు 40 శాతం మేర పెంచారు. అలాగే పండ్లు, ఫలాల ధరలు హోల్సేల్ మార్కెట్లో 10–15 శాతం పెరగ్గా రిటైల్లో 20 శాతం మేర ధరలు పెంచాల్సి వచ్చిందని చిరు వ్యాపారులంటున్నారు. -
టమాటా మోత..మరో రెండు నెలలు!
న్యూఢిల్లీ: అకాల వర్షాలు, అధిక వర్షాలతో కూరగాయల ధరలకు ముఖ్యంగా టమాటా ధరలకు రెక్కలు వచ్చాయి. కిలో రూ.100 వరకు ఉన్న టమాటా ధర ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని క్రిసిల్ అంచనా వేస్తోంది. మరో రెండు నెలల వరకు టమాటా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేలా కనిపించడం లేదని క్రిసిల్ అధ్యయనం చెబుతోంది. దేశంలో టమాటా అత్యధికంగా పండించే రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటకలో సాధారణ వర్షపాతానికి మించి 105%, ఆంధ్రప్రదేశ్లో సాధారణానికి మించి 40%, మహారాష్ట్రలో 22% అధికంగా వానలు నమోదయ్యాయి. దీంతో, అక్టోబర్–డిసెంబర్ కాలంలో కీలక సరఫరాదారులైన ఈ మూడు రాష్ట్రాల్లో చేతికొచ్చిన టమాటా పంట నేలపాలైందని క్రిసిల్ అంటోంది. దీంతో, నవంబర్ 25 నాటికి 142% మేర ధరలు పెరిగాయి. మధ్యప్రదేశ్, రాజస్తాన్ల నుంచి టమాటా పంట చేతికందే వచ్చే జనవరి వరకు ధరల్లో ఇదే తీరు కొనసాగుతోందని క్రిసిల్ అంచనా వేస్తోంది. కొత్తగా పంట వస్తే టమాటా ధర 30% మేర తగ్గుతుందని చెబుతోంది. అయితే, టమాటా అధిక ధరల ప్రభావం డిసెంబర్ నుంచి తగ్గుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి టమాటా తాజా పంట మార్కెట్లోకి రావడం మొదలైతే ధరలు దిగివస్తాయని పేర్కొంది. ఉల్లి ధరలు కూడా మరో 10–15 రోజుల తర్వాతే తగ్గుతాయని క్రిసిల్ తెలిపింది. అత్యధికంగా సాగయ్యే మహారాష్ట్రలో తక్కువ వర్షపాతంతో ఆగస్ట్లో సాగు ఆలస్యమైంది. దీంతో, పంట ఆలస్యం కావడంవల్ల ధరలు 65% పెరిగాయని తెలిపింది. -
‘ధర’ణిలో బతికేదెలా!
వర్షాభావ పరిస్థితులతో పంట దిగుబడులు తగ్గి కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. మిర్చి ముట్టుకోకుండానే మంటపుట్టిస్తుంటే..టమోటా ధర విని ఠారెత్తిపోతున్నారు. వంగ, బెండ, బంగాళదుంప, క్యారెట్, క్యాబేజీ ఇలా ఒకటేమిటి చివరకు ఆకుకూరల ధరలూ నింగినంటుతూ వినియోగదారునికి చుక్కలు చూపిస్తున్నాయి. సాక్షి, ఒంగోలు సిటీ: భోజనంలో షడ్రుచులకు కాలం కలిసి రావడం లేదు. సామాన్యుడు ఒక కూర చేసుకోవడానికి వెనుకాడుతున్నాడు. పచ్చడి మెతులుకు ఖరీదుగా మారాయి. వారానికి ఒక మారు తినే మాంసాహారాన్ని వాయిదా వేసుకుంటున్నారు. మధ్యతరగతి కుటుంబాలే రెండు, మూడు వారాలకు ఒక పర్యాయం తెచ్చుకుంటున్నారు. ఎక్కువ భాగం కుటుంబాలు పొదుపు, జాగ్రత్తకు అలవాటు పడుతున్నారు. కూరగాయలు..ఆకుకూరల ధరలు దడ పుట్టిస్తున్నాయి. జిల్లాలోని కుటుంబాలకు సుమారు 450 టన్నుల వరకు వివిధ రకాల కూరగాయలు అవసరమవుతున్నాయి. 150 టన్నుల వరకు ఆకుకూరల అవసరం ఉంది. ఈ వేసవిలో దిగుబడులు బాగా తగ్గాయి. వీటిలో సగ భాగం కూడా రావడం లేదు. వచ్చిన సరుకులోనూ అత్యధిక భాగం సచ్చులు, పుచ్చులు, నాణ్యత లేని కూరగాయలు, ఆకుకూరలు మార్కెట్లోకి వస్తున్నాయి. అంత తాజాగా లేకపోయినా అవసరాలకు అనుగుణంగా వాటినే కొంటున్నారు. నిత్యం మార్కెట్కు వచ్చే కొన్ని రకాలు రెండు, మూడు రోజులకు ఒక మారు కూడా వచ్చే పరిస్థితి లేదు. మునక్కాయలు, నిమ్మకాయలు, క్యారెట్, క్యాబేజి, బంగాళా దుంపలు ఇలా కొన్ని రకాల కూరగాయలు తగినంత రావడం లేదు. అమ్మో..కొనలేం..తినలేం చుక్కలు చూస్తున్న ధరలతో సామాన్యుడు కూరగాయలు కొనలేకపోతున్నాడు. టమోటా నారాకోడూరు నుంచి జిల్లాకు వస్తుంది. మదనపల్లి నుంచి కొంత భాగం వస్తుంది. మార్కెట్లో నిన్న,మొన్నటి వరకు టమోటా కిలో రూ.60–రూ.70 వరకు విక్రయించారు. ప్రస్తుతం కిలో రూ.55–రూ.60 ధర పలుకుతోంది. జిల్లాలో కొంత భాగం బంగాళాదుంప సాగు చేశారు. దుంప కిలో రూ.35 విక్రయిస్తున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి బంగాళదుంప తెస్తున్నారు. బంగాళదుంపలు బాగా గిరాకి పలుకుతున్నాయి. హాట్చిప్స్ తయారు చేసే వారు, హోటళ్ల నిర్వాహకులకే దుంప చాలడం లేదు. మార్కెట్లో చిన్న సైజు దుంప లభిస్తోంది. ధరలో మాత్రం తేడా లేదు. అల్లం కిలో రూ.170 వరకు విక్రయిస్తున్నారు. వెల్లుల్లి మొదటి రకం కిలో రూ.350 వరకు పలుకుతోంది. వెల్లుల్లి రెబ్బలకు మంచి గిరాకీ ఉంది. క్యాబేజి అరకొరగానే లభిస్తోంది. ఉల్లిపాయలు మహారాష్ట్ర నాశిక్, కర్నూలు నుంచి జిల్లాకు తెస్తున్నారు. పెద్ద సైజు ఉల్లిపాయలు కిలో రూ.25–రూ.30 వరకు విక్రయిస్తున్నారు. ఇళ్లల్లోని ప్లాస్టిక్ సామాన్లు, పేపర్లు ఇతర పనికి రాని వస్తువులను ఉల్లిపాయలకు కొనే వారు రావడమే మానేశారు. ఉల్లి ధర అందుబాటులో లేకపోవడంతో వ్యాపారాలను విరమించుకున్నారు. నిమ్మకాయ ఒకటి రూ.5.30పై అమ్ముతున్నారు. అదీ అంతగా నాణ్యత ఉండడం లేదు. నిమ్మ పిందెలు మార్కెట్లో లభించడం లేదు. హోటళ్లల్లో నిమ్మ దబ్బలు ఇవ్వడానికి వెనుకాడుతున్నారు. గూడూరు, తెనాలి నుంచి నిమ్మ మార్కెట్ బాగా జరుగుతుంది. అక్కడి నుంచి తెచ్చిన సరుకు ఇక్కడ టోకుకు విక్రయిస్తున్నారు. చిల్లరగా నిమ్మకాయ రూ.5.30 అదే డజను రూ.60కి అమ్ముతున్నారు. అల్లం మార్కెట్ కడప అధికంగా ఉంటుంది. అక్కడి నుంచి అల్లం దిగుబడి బాగా తగ్గింది. మార్కెట్లో మునక్కాయ లభించడం లేదు. 250 గ్రాములు మునక్కాయలు రూ.50కి విక్రయిస్తున్నారు. మిర్చి కిలో రూ.65 ధర పలుకుతోంది. రెండో రకం కిలో రూ.55కి అమ్ముతున్నారు. ఏ రకం తీసుకున్నా అమ్మో అనక మానదు. కూరగాయలు కొనలేం..తినలేం. ఆకుకూరలు అధికంగా కొత్తపట్నం, అద్దంకి, బేస్తవారపేట తదితర ప్రాంతాల నుంచి మార్కెట్లోకి వస్తుంది. రూ.10కి మూడు కట్టలు ఇచ్చే రోజులకు కాలం చెల్లింది. ఇప్పుడు రూ.10కి ఒక కట్టే ఇస్తున్నారు. తోటకూర, గోంగూర, చుక్కకూర, మెంతికూర ధరలు దడపుట్టిస్తున్నాయి. కొత్తిమీర గిరాకీ బాగా పెరిగింది. నా«ంధేడ్ మార్కెట్ వట్టిపోయింది. జిల్లా మార్కెట్కు స్ధానికంగా పండే కొత్తిమీర తగ్గిపోయింది. ఇక నాంథేడ్ మార్కెట్ నుంచి వచ్చే కొత్తిమీరే దిక్కు. కొత్తిమీర అవసరమైనా ధర చూసి విరమించుకుంటున్నారు. పుదీనా కట్ట రూ.30 ధర పలుకుతోంది. మార్కెట్లో పుదీనా కన్పించడం లేదు. కూరగాయలు, ఆకుకూరలు మార్కెట్లో కొనే పరిస్ధితి లేదు. సామాన్యుడి నోటికి చిక్కం మార్కెట్లో విపరీతంగా పెరిగిన ధరలను చూసి సామాన్యుడు గుడ్లు తేలేస్తున్నాడు. తినాలని కోరిక ఉన్నా నోటికి చిక్కం కట్టుకుంటున్నాడు. పిల్లలకు పౌష్టికాహారం లభించే పరిస్థితి కనిపించడం లేదు. వసతి గృహాల్లో కూరలు, సాంబారుకు కూరగాయలు వేయాలంటే వెనుకాడుతున్నారు. అంతగా నాణ్యత లేని సాంబారు, రసం దక్కుతుంది. హోటళ్లల్లో కూరలకు గిరాకీ పెరిగింది. నిత్యం రద్దీగా ఉంటే హోటళ్లలోనే కూరల రకాలను తగ్గించేస్తున్నారు. సాంబారులో వేసే కూరగాయల రకాలను తగ్గించేస్తున్నారు. సామాన్యుడు కర్రీస్ పాయింట్లపై ఆధారపడ్తున్నారు. ఒంగోలు నగరంలో ప్రతి బజారులో కర్రీ పాయింట్ ఉండేది. ఇప్పుడు సగానికిపైగా కర్రీ పాయింట్లు మూతపడ్డాయి. పెరిగిన కూరగాయలు, ఆకుకూరల ధరలతో కర్రీ పాయింట్లను నిర్వహించడం వల్లకాదంటున్నారు. పెద్ద కర్రీ పాయింట్లలో ఆ రోజుకు తక్కవగా ఉన్న కూరగాయల రకాలతో వండిన కూరలను విక్రయిస్తూ నెట్టుకొస్తున్నారు. కరువు పీడిస్తోంది భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సాగు నీరు ఐదేళ్లుగా రాలేదు. సాగు విస్తీర్ణం పడిపోయింది. బోర్ల కింద కూరగాయల సాగు జరుగుతోంది. సుమారు లక్షన్నర ఎకరాల్లో కూరగాయల సాగు జరుగుతున్నా జిల్లా అవసరాలకు అనుగుణంగా సరుకు దిగుబడి రావడం లేదు. వానలు పడకపోయినా, భూగర్భ జలాలు పెరగకపోయినా కూరగాయల మార్కెట్ సంక్షోభంలో పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మార్టూరు మార్కెట్లోనూ కూరగాయలు ధరలు దడ పుట్టిస్తున్నాయి. అద్దంకి సంతలో సామాన్యులకు ధరలు అందుబాటులో లేవు. -
నిత్యావసరం.. నిత్య సమరం!
►సామాన్యుడిపై ధరాఘాతం ► దిగిరానంటున్న పప్పులు, కూరగాయ ధరలు ► పచ్చి మిర్చి, ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు పైపైకి ► రూ.120-130 మధ్యే పప్పులు ► మూడురెట్లు పెరిగిన ఆకుకూరలు ►4 వేల హెక్టార్లకు గానూ వెయ్యి హెక్టార్ల సాగుకే ఉల్లి పరిమితం ► ఇప్పటివరకు మిర్చి సాగు జాడే లేదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పప్పులు, కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సాగు చతికిలపడడంతో పచ్చి మిర్చి ధర నషాళాన్ని తాకుతోంది. ఉల్లి ఘాటెక్కిస్తోంది. ఇక అల్లం, వెల్లుల్లి ధరలైతే ఏకంగా పావు కిలో రూ.40కి చేరాయి. కొండెక్కిన పప్పుల ధరలు రూ.120-130తో మధ్య తచ్చాడుతున్నాయి. ఖరీఫ్ మొదలైనా ఆశించిన రీతిలో కాయగూరల సాగు జోరందుకోకపోవడం, పంటల విస్తీర్ణం ఆశాజనకంగా లేకపోవడంతో సామాన్యుడిపై ధరాఘాతం తప్పడం లేదు! ఉల్లి ఘాటు.. మిర్చి పోటు రాష్ట్రంలో డిమాండ్ మేరకు కూరగాయలు సరఫరా కాకపోవడంతో ధరలు భారీగా పెరుగుతూ పోతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో టమాటా, వంకాయ, కాకరకాయ ధరలన్నీ కిలో రూ.30 వరకు ఉండగా, బెండకాయ రూ.40, బీరకాయ రూ.60, చిక్కుడు, క్యాప్సికం రూ.40 వరకు పలుకుతున్నాయి. రాష్ట్రంలో సాధారణంగా కూరగాయల సాగు 6 లక్షల ఎకరాలు. అయితే ఇప్పటివరకు 4 లక్షల్లోనే సాగయ్యాయి. ఉల్లి 10 వేల ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా.. కేవలం రెండున్నర వేల ఎకరాలకే పరిమితమైంది. మిర్చి 1.45 లక్షల ఎకరాలకుగానూ ఇప్పటివరకు ఒక్క ఎకరంలోనూ సాగు కాలేదు. దీంతో గత నెల కిలో రూ.40 పలికిన పచ్చి మిర్చి ధర అమాంతం రూ.60కి పెరిగింది. ఉల్లి ధర నెలలోనూ రూ.20నుంచి రూ.30కి పెరిగింది. పప్పుల సాగు విస్తీర్ణం ఇంకా ఆశించిన మేర పుంజుకోలేదు. ఇప్పుడిప్పుడే 2.23 లక్షల హెక్టార్లలో సాగు మొదలైన దృష్ట్యా కందిపప్పు, మినప్పప్పు, పెసర పప్పు ధరలన్నీ ఇంకా రూ.120 నుంచి రూ.130 మధ్యే కొనసాగుతున్నాయి. ఆకుకూరల ధరలు మూడు రెట్లు ఆకుకూరల ధరలు రెండు నుంచి మూడు రెట్ల వరకూ పెరిగాయి. రెండు నెలల కిందటి వరకూ రూ.5 ఉన్న ఆకుకూరల కట్ట ఇప్పుడు రూ. 15కు పెంచేశారు. గోంగూర కట్ట రూ.5 నుంచి రూ.10కి పెరగ్గా, తోటకూర, బచ్చలాకు, చుక్కాకు, కొత్తిమీర ధరలు మూడు రెట్లు పెరిగాయి. రూ.5 ఇవ్వందే కరివేపాకు రెమ్మ కూడా ఇవ్వడం లేదు. రూ.5 ఉన్న పాలకూర కట్ట రూ. 10కి చేరింది. వేసవి వల్ల నీళ్లు లేక దిగుబడి పడిపోయిందని, అందువల్లే ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. చికెన్ స్కిన్లెస్ రూ.190 ఎన్నడూ లేనివిధంగా చికెన్, మటన్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. 15 రోజుల కిందటి వరకు స్కిన్లెస్ చికెన్ ధర రూ.120 నుంచి రూ.130 వరకు ఉండగా అది ఇప్పుడు ఏకంగా రూ.190కి పెరిగింది. ఇది గతేడాది ధరతో పోలిస్తే దాదాపు రెండు రెట్లు. మట న్ ధర కిలో రూ.480 ఉండగా రూ.550కి పెరిగింది. ఇప్పట్లో ఈ ధరలు సైతం తగ్గే అవకాశ ం లేదని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ధరల పెరుగుదలతో సామాన్య, దిగువ మధ్యతరగతి ప్రజలు మాంసాహారం దాదాపు మర్చిపోయే పరిస్థితి ఏర్పడింది.