
న్యూఢిల్లీ: సాగు ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల పెంపు (ఎంఎస్‌పీ)తో రిటైల్ ద్రవ్యోల్బణం 73 బేసిస్ పాయింట్లు (0.73 శాతం) పెరుగుతుందని, ప్రభుత్వ కొనుగోళ్లపైనే ఇది ఆధారపడి ఉంటుందని ఎస్‌బీఐ నివేదిక ‘ఈకోరాప్’ తెలియజేసింది.
14 ఖరీఫ్ పంటలకు ఎంఎస్‌పీని పెంచాలన్న ప్రభుత్వ నిర్ణయం రైతుల ఒత్తిళ్లను పరిష్కరించే దిశగా ఆహ్వానించతగినది అని పేర్కొంది. మద్దతు ధరల పెంపుతో రిటైల్ ద్రవ్యోల్బణంపై పడే ప్రభావం 50–100 బేసిస్ పాయింట్ల వరకు ఉండొచ్చని వివిధ అంచనాలు వెలువడుతుండటం గమనార్హం. జీడీపీపై 0.2–0.4 శాతం స్థాయిలోనూ ప్రభావం చూపించొచ్చన్న అంచనాలున్నాయి.