నిత్యావసరాల ధరల మంట | Retail inflation quickens to 5.76% in May on higher food prices | Sakshi
Sakshi News home page

నిత్యావసరాల ధరల మంట

Published Tue, Jun 14 2016 12:56 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

నిత్యావసరాల ధరల మంట

నిత్యావసరాల ధరల మంట

5.76%కి రిటైల్ ద్రవ్యోల్బణం
రెండేళ్ల గరిష్ట స్థాయి... ఆర్‌బీఐ రేటు కోత లేనట్లే

 న్యూఢిల్లీ: నిత్యావసరాల ధరల తీవ్ర స్థాయిని మే రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2015 మేతో పోల్చితే 2016 మేలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 5.76 శాతం పెరిగింది. కూరగాయలు సహా ఇతర ఆహార ఉత్పత్తుల ధరల తీవ్రత దీనికి కారణం. ఈ రేటు రెండేళ్ల గరిష్ట స్థాయి.  తాజా డేటా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తదుపరి రెపో రేటు (ప్రస్తుతం 6.5 శాతం) కోత అవకాశాలకు విఘాతం కలిగించే అంశమని నిపుణులు పేర్కొంటున్నారు. 2015లో ఈ రేటు 5.01 శాతంగా ఉంది. కొన్ని ఉత్పత్తుల ధరలు చూస్తే...

ఆహార విభాగంలో... రేటు 7.55 శాతం ఎగిసింది.  ఇందులో వేర్వేరుగా కూరగాయల ధరలు 2015 మే ధరలతో పోల్చిచూస్తే... 2016 మేలో 10.77 శాతం ఎగిశాయి. 2015 ఏప్రిల్‌లో ఈ పెరుగుదల రేటు 4.82 శాతం.   గుడ్ల ధరలు ఏప్రిల్‌లో 6.64 శాతం పెరిగితే, మేలో ఈ రేటు ఏకంగా 9.13 శాతం ఎగిసింది. మాంసం, చేపల ధరలు 8.67 శాతం ఎగిశాయి. పప్పు దినుసుల ధరలు 32 శాతం ఎగిశాయి. చక్కెర ధర పెరుగుదల 14 శాతం. సుగంధ ద్రవ్యాల ధరలు 10 శాతం పెరిగాయి. పాల ధరలు 4 శాతం పెరిగాయి.

దుస్తులు, పాదరక్షల ధరల పెరుగుదల రేటు 5.37 శాతంగా ఉంది.

హౌసింగ్ విషయంలో రేటు 5.35 శాతంగా ఉంది.

 ఇంధనం, లైట్ విభాగంలో రేటు 3 శాతం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement