ద్రవ్యోల్బణం లక్ష్యాలు భారత్‌కు సానుకూలం
రేటింగ్ కోణంలో మూడీస్ అంచనా
న్యూఢిల్లీ : రిటైల్ ద్రవ్యోల్బణం వచ్చే ఐదేళ్లూ ‘ప్లస్ 2 అండ్ మైనస్ 2తో’ నాలుగు శాతంగా ఉండాలన్న కేంద్రం లక్ష్యం భారత్‌కు క్రెడిట్ పాజిటివ్ అంశమని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డారీ డిరోన్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం పెరిగితే గరిష్ట పరిమితి 6 కాగా, తగ్గితే కనిష్ట పరిమితి 2 శాతంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల నిర్ధేశించిన సంగతి తెలిసిందే. డిపాజిట్లపై ఇటీవల తగ్గించిన వడ్డీరేట్లు, వాస్తవ రిటర్న్స్ వంటి అంశాల ప్రాతిపదికన ప్రభుత్వం ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు ఆర్థికమంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సంవత్సరం ఆరంభంలో ద్రవ్యోల్బణాన్ని 4 శాతం వద్ద కట్టడి చేయడానికి ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి మధ్య అవగాహన కుదరటం తెలిసిందే.