సంస్కరణలు చూడండి... రేటింగ్ పెంచండి..!
మూడీస్‌కు ఆర్థిక (శాఖ) వివరాలు
న్యూఢిల్లీ: భారత్‌లో వివిధ సంస్కరణలు చేపట్టడం జరిగిందనీ, దేశాన్ని వ్యాపార సానుకూలంగా మార్చుతున్నామని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ- మూడీస్‌కు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. తద్వారా రేటింగ్ పెంచడానికి తగిన అన్ని అవకాశాలూ ఉన్నాయని వివరించింది. అయితే బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిల పరిస్థితిపై అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మూడీస్ పేర్కొంది. రేటింగ్ పెంపునకు సంబంధించి ఆర్థికశాఖ సీనియర్ అధికారులు, మూడీస్ ప్రతినిధుల మధ్య బుధవారం కీలక సంప్రతింపులు జరిగాయి. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్, ఆ శాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం భారత్‌కు మూడీస్ పాజిటివ్ అవుట్‌లుక్‌తో ‘బీఏఏ3’ రేటింగ్ ఇస్తోంది