ఎయిర్‌టెల్‌కు రేటింగ్‌ షాక్‌ | Bharti Airtel dips Moodys places s rating on review for downgrade | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్‌కు రేటింగ్‌ షాక్‌

Published Fri, Nov 9 2018 2:05 PM | Last Updated on Fri, Nov 9 2018 2:05 PM

Bharti Airtel dips  Moodys places s rating on review for downgrade - Sakshi

సాక్షి, ముంబై: టెలికాం కంపెనీలకు రేటింగ్‌ షాక్‌ తగిలింది. ప్రధానంగా టెలికా మేజర్‌ భారతి ఎయిర్‌టెల్‌కు డౌన్‌ రేటింగ్‌ దెబ్బ పడింది.   బాండ్‌ రేటింగ్‌లో  అతి తక్కువ రేటింగ్‌ ఇవ్వడంతో  శుక్రవారం నాటి  ట్రేడింగ్‌లో ఎయిర్‌టెల్‌ కౌంటర్‌ దాదాపు 5 శాతానికిపైగా పతనమైంది. మూడీస్‌ ఎయిర్‌టెల్‌కు బీఏఏఏ3 ర్యాంకింగ్‌ఇచ్చింది. లాభాలు, క్యాష్‌  ఫ్లో బలహీనంగా ఉండనుందని  మూడీస్‌ అంచనా వేసింది.

తమ సమీక్షలో ఎయిర్‌టెల్‌ లాభదాయకత, ప్రత్యేకంగా భారతీయ మొబైల్  సేవల లాభాలు క్షీణత, అధిక రుణభారం, తరుగుతున్న మూలధన నిధుల కారణంగా  ఈ అంచనాకు వచ్చినట్టు మూడీ వైస్‌ ప్రెసిడెంట్‌ , సీనియర్ క్రెడిట్ ఆఫీసర్ అన్నాలిసా డిచియారా చెప్పారు

కాగా వరుసగా పదవ త్రైమాసికంలో కూడా ఎయిర్‌టెల్‌  లాభాలు దారుణంగి పడిపోయాయి. 2018 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో సునీల్ మిట్టల్ నేతృత్వంలోని ఎయిర్‌టెల్‌  లాభాలు 65.4 శాతం క్షీణించింరూ. 119 కోట్లనుసాధించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం 343 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం ఆదాయం   రూ .20,422 కోట్లుగా నమోదైంది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో రూ .21,777 కోట్ల కంటే 6.2 శాతం తక్కువ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement