
సాక్షి, న్యూఢిల్లీ : రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ నాలుగు నెలల గరిష్టాన్ని నమోదు చేసింది. జనవరి మాసంలో 2.05 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం ఫిబ్రవరి నెలలో 2.57 శాతానికి చేరింది. అటు ఫిబ్రవరి పారిశ్రామికోత్పత్తి 1. 7 శాతానికి పడిపోయింది.
ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిబ్రవరి నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 2.05 శాతం నుంచి 2.57 శాతానికి పెరిగింది. ఫ్యాక్టరీ ఉత్పత్తి జనవరి నెలలో 2.4 శాతం నుంచి 1.7 శాతానికి క్షీణించింది.
Comments
Please login to add a commentAdd a comment