ముంబై: భారత ఆరి్థక వ్యవస్థ రెండో త్రైమాసికంలో ఊపందుకుంటోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఆర్టికల్ ఒకటి పేర్కొంది. అయితే వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం ఆర్‌బీఐకి నిర్దేశిస్తున్న స్థాయికి మించి (6 శాతం) సగటున కొనసాగుతుండడమే ఆందోళన కరమైన అంశమని ఆర్‌బీఐ నెలవారీ బులెటిన్‌లో వెలువడిన ఒక కథనం పేర్కొంది.
జూన్‌లో 4.87 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బనం జూలైలో 15 నెలల గరిష్ట స్థాయి 7.44 శాతానికి ఎగసిన నేపథ్యంలో తాజా కథనం వెలువడ్డం గమనార్హం. సమీక్షా నెల్లో టమాటా, కూరగాయలు, ఇతర ఆహార ఉత్పత్తుల ధరలు తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ధరల తీవ్రత విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ తన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోసైతం ప్రస్తావిస్తూ, సమస్యను తగ్గించడానికి తగిన మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఆర్‌బీఐ అభిప్రాయాలు కావు...
రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేబబ్రత పాత్ర నేతృత్వంలోని బృందం ఈ కథనాన్ని రచించింది. అయితే, ఆరి్టకల్‌లో వ్యక్తీకరించిన అభిప్రాయాలు రచయితలవి మాత్రమేనని, వీటిని రిజర్వ్ బ్యాంక్ అభిప్రాయాలుగా పరిగణించరాదని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. వెలువడిన ఆరి్టకల్‌లోని కొన్ని అంశాలు పరిశీలిస్తే.. మొదటి త్రైమాసికంలో పటిష్టమైన పనితీరు తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా మందగించింది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్‌లో వినియోగ డిమాండ్ బాగుంది. పెట్టుబడుల పరిస్థితి ప్రోత్సాహకరంగా కొనసాగుతోంది. ఆయా అంశాలు భారత్‌కు లాభిస్తున్నాయి. అంతర్జాతీయ మందగమన పరిస్థితులతో కుంటుపడిన ఎగుమతుల క్షీణబాట ప్రతికూలతలను అధిగమించగలుగుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment