ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల కీలక సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఈ సమావేశం విధాన నిర్ణయాలు వెల్లడవుతాయి. రిటైల్ ద్రవ్యోల్బణం అదుపులోనికిరాని పరిస్థితుల్లో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) మరింత తగ్గించే అవకాశాలు లేనట్లేనని నిపుణులు పేర్కొంటున్నారు. ‡ ఇక 2020–21 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణ రేటు అంచనాలను ఎంపీసీ తగ్గించే అవకాశం ఉంది. అలాగే వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) మరింత మెరుగుపడ్డానికి తగిన చర్యలనూ ప్రకటించవచ్చని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment