దేశంలో నిత్యవసరాల ధరల మంట మండుతోంది. పెట్రోల్,డీజిల్‌తో పోటీగా కూరగాయలు, వంటనూనెల ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ ధరా భారం నిరుపేదలనే కాకుండా మధ్యతరగతి, ఆపై వర్గాల వారినీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీని ప్రభావం కారణంగా ఆహార ద్రవ్యోల్బణం దూసుకెళ్తుంది.
డిసెంబర్ నెలలో ఆహార ద్రవ్యోల్బణం 4.19 శాతం ఉండగా..జనవరిలో 5.94 శాతానికి చేరింది. ప్రైస్ ఇండెక్స్ బాక్స్ ప్రకారం..రిటైల్ ద్రవ్యోల్బణంలో ఆహార ధరల ద్రవ్యోల్బణం వాటా దాదాపు 40 శాతంగా ఉంది.
ఆర్‌బీఐ తొలిసారి మూడు నెలల కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (సీపీఐ) ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేసింది. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం 6.77 శాతంగా ఉంది.
దేశంలో ఆహార ధరలు విపరీతంగా పెరిగడం వల్లే రీటైల్ ద్రవ్యోల్బణం పెరిగింది. ఇక తృణధాన్యాల ధరలు ఏడాది ప్రాతిపదికన 16.12 శాతం పెరగగా, గుడ్లు 8.78 శాతం, పాలు 8.79 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 11.7 శాతం పడిపోయాయి.
ద్రవ్యోల్బణం అంటే
వస్తువుల సాధారణ ధరలు ఒక పీరియడ్ ఆఫ్ టైమ్లో క్రమంగా పెరిగే స్థాయినే ద్రవ్యోల్బణం అంటారు. మూడు నెలలు లేదా ఆరు నెలలు లేదా ఏడాది ఇలా ఒక పర్టిక్యులర్ కాలాన్ని లెక్కలోకి తీసుకొని ఈ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment