కట్టు తప్పిన ధరలు - ఊపునివ్వని పరిశ్రమలు | Retail inflation at 6.07 per cent in July | Sakshi
Sakshi News home page

కట్టు తప్పిన ధరలు - ఊపునివ్వని పరిశ్రమలు

Published Sat, Aug 13 2016 1:34 AM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

కట్టు తప్పిన ధరలు - ఊపునివ్వని పరిశ్రమలు

కట్టు తప్పిన ధరలు - ఊపునివ్వని పరిశ్రమలు

జూలై రిటైల్ ద్రవ్యోల్బణం 6.07 శాతం
రెండేళ్ల గరిష్ట స్థాయి
ఇక జూన్ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి 2.1 శాతం

 

న్యూఢిల్లీ: స్థూల ఆర్థికాంశాల్లో ప్రధానమైన-  రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి తాజా గణాంకాలు నిరాశపరిచాయి. జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం కట్టు తప్పి ఏకంగా 6.07 శాతానికి ఎగసింది. ఇది రెండేళ్ల గరిష్ట స్థాయి.  ఇందుకు సంబంధించి ఒక్క ఆహార ఉత్పత్తుల ధరలను చూస్తే, సామాన్యునికి భారంగా ఏకంగా 8 శాతం పెరిగాయి.   ఇక జూన్‌లో  పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ) వృద్ధిరేటు  2.1 శాతంగా నమోదయ్యింది. 2015 ఇదే కాలంలో ఈ రేటు 4.2 శాతంగా ఉంది. అయితే 2016 మే నెలతో పోల్చితే మాత్రం ఈ ఫలితం కొంత ఊరటనిచ్చింది. మేలో ఈ రేటు 1.1 శాతంగా నమోదయ్యింది. కాగా ఏప్రిల్ నుంచి జూన్ వరకూ క్యూ1లో 3.3 శాతం నుంచి 0.6 శాతానికి తగ్గింది.

 
కీలక పారిశ్రామిక విభాగాలను చూస్తే

తయారీ: మొత్తం ఐఐపీలో దాదాపు 75 శాతం వాటా కలిగిన ఈ విభాగంలో వృద్ధి రేటు వార్షికంగా 5.2 శాతం నుంచి 0.9 శాతానికి పడిపోయింది.   ఈ విభాగంలోని 22 పరిశ్రమల్లో 18 సానుకూల వృద్ధి రేటును నమోదుచేసుకున్నాయి. ఏప్రిల్-జూన్ నెలల కాలంలో ఈ రేటు 3.7 శాతం వృద్ధి నుంచి -0.7 శాతం క్షీణతలోకి జారిపోయింది.


మైనింగ్: ఈ రంగం మంచి ఫలితాన్ని అందించింది.  -0.4 శాతం క్షీణత నుంచి 4.7 శాతం వృద్ధికి మళ్లింది. త్రైమాసికంలో సైతం ఈ రేటు 0.4 శాతం నుంచి 2.3 శాతానికి పెరిగింది.

 
4 నెలల నుంచీ ‘రిటైల్ ధరలు’ అప్

నాలుగు నెలల నుంచీ పెరుగుతూ వస్తున్న రిటైల్ ద్రవ్యోల్బణం... జూలైలో ఏకంగా రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇది వచ్చే ఐదేళ్లలో 4 శాతం (ప్లస్ 2 లేదా మైసస్ 2) ఉండాలని ప్రభుత్వం నిర్దేశించుకున్న నేపథ్యంలోనే ఇందుకు విరుద్దంగా తాజా గణాంకాలు రావడం గమనార్హం.  కొన్ని నిత్యావసర ధరలను చూస్తే- పప్పు దినుసుల ధరలు వార్షికంగా జూలైలో భారీగా 28 శాతం ఎగశాయి. చక్కెర ధరలు 22 శాతం పెరిగాయి. కూరగాయల ధరలు 14 శాతం ఎగశాయి. గుడ్ల ధరలు 9 శాతం పెరిగాయి. పాలు, పాల ఉత్పత్తుల ధరలు 5 శాతం పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement