ఆగస్టులో పారిశ్రామికోత్పత్తి మైనస్ 0.1%
జూలైలో ఇది 4.7 శాతం
మైనింగ్, విద్యుత్ ఉత్పత్తిలో క్షీణత
న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు రెండేళ్ల విరామం తర్వాత ఆగస్టు నెలలో ప్రతికూలానికి పడిపోయింది. మైనస్ 0.1 శాతంగా నమోదైంది. పరిశ్రమల ఉత్పత్తిని ప్రతిబింబించే పారిశ్రామిక ఉత్పాదక సూచీ (ఐఐపీ) వృద్ధి జూలై నెలకు 4.7 శాతంగా ఉండడం గమనార్హం. క్రితం ఏడాది ఆగస్టు నెలలోనూ ఐఐపీ 10.9 వృద్ధిని నమోదు చేసింది. ప్రధానంగా మైనింగ్, విద్యుదుత్పత్తి రంగంలో క్షీణత ఐఐపీ పడిపోవడంలో కీలకంగా పనిచేసింది. అదే సమయంలో తయారీ రంగంలోనూ ఉత్పాదకత పుంజుకోలేదు.
జాతీయ గణాంక కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) ఈ వివరాలను విడుదల చేసింది. ఇక ప్రస్తుత ఆరి్థక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు (ఐదు నెలల్లో) ఐఐపీ వృద్ధి 4.2 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలానికి నమోదైన 6.2 శాతం కంటే తక్కువ. వృద్ధి రేటు మైనింగ్ రంగంలో మైనస్ 4.3 శాతానికి పడిపోయింది. విద్యుదుత్పత్తి రంగంలో మైనస్ 3.7 శాతంగా నమోదైంది. తయారీలో 0.1 శాతంగా ఉంది. ఆగస్ట్ నెలలో అధిక వర్షాలు మైనింగ్ రంగంలో వృద్ధి క్షీణతకు కారణమని ఎన్‌ఎస్‌వో తెలిపింది. చివరిగా 2022 అక్టోబర్ నెలలో ఐఐపీ వృద్ధి ప్రతికూలంగా నమోదు కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment