అక్టోబర్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతం
14 నెలల గరిష్ట స్థాయికి జంప్
న్యూఢిల్లీ: భారత్ రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో బెంబేలెత్తించింది. 14 నెలల గరిష్ట స్థాయిలో 6.2%గా నమోదైంది. ఆర్‌బీఐ పాలసీకి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం అటు ఇటుగా 4 శాతం వద్ద ఉండాలి. అంటే ఎగువదిశగా 6 శాతం పైకి పెరగకూడదు. తాజా గణాంకాల నేపథ్యంలో ఆర్‌బీఐ సమీప భవిష్యత్‌లో వడ్డీరేట్ల తగ్గుదలకు సంకేతాలు ఇవ్వకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం 6.5 శాతంగా ఉన్న రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు) తగ్గే అవకాశాలు లేవని వారు విశ్లేషిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం దిగువన కొనసాగింది.
⇒ ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం సమీక్షా నెలలో 10.87 శాతం పెరిగింది.
⇒ దేశ వ్యాప్తంగా రిటైల్ ద్రవ్యోల్బణం 6.2% ఉంటే, గ్రామీణ ప్రాంతాల్లో 6.68%గా, పట్టణ ప్రాంతాల్లో 5.62 శాతంగా నమోదయ్యింది.
⇒1,114 పట్టణ, 1,181 గ్రామీణ మార్కెట్‌లలో ధరలను వారంవారీగా విశ్లేషించి జాతీయ గణాంకాల కార్యాలయం నెలవారీ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు విడుదల చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment