పారిశ్రామిక ఉత్పత్తి.. స్వల్ప ఊరట | January IIP at 0.1 per cent; April-January IIP at 0 per cent | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక ఉత్పత్తి.. స్వల్ప ఊరట

Published Thu, Mar 13 2014 12:56 AM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

January IIP at 0.1 per cent; April-January IIP at 0 per cent

న్యూఢిల్లీ: కొంచెం ఊరటనిస్తూ... జనవరిలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిబాటలోకి ప్రవేశిం చింది. మూడు నెలలపాటు అసలు వృద్ధిలేకపోగా, క్షీణతలో ఉన్న ఈ సూచీ 2014 జనవరిలో స్వల్పంగా 0.1% వృద్ధిని (2013 జనవరితో పోల్చితే) నమోదుచేసుకుంది. విద్యుత్, మైనింగ్ రంగాలు ఈ సానుకూల ఫలితానికి కొంత కారణం. కాగా మొత్తం సూచీలో 75% వాటా ఉన్న తయారీ రంగం మాత్రం ఇంకా నీరసంగానే ఉంది.  

 రంగాల వారీగా ...
     విద్యుత్ ఉత్పత్తి రంగం జనవరిలో 6.5% వృద్ధిని నమోదుచేసుకుంది. 2013 జనవరిలో ఈ రేటు 6.4%.  
     మొత్తం ఐఐపీలో 14% వాటా కలిగిన మైనింగ్ రంగం జనవరిలో (-) 1.8% క్షీణబాట నుంచి 0.7% వృద్ధిలోకి మళ్లింది.  
     తయారీ రంగం 2.7 శాతం వృద్ధి నుంచి 0.7 క్షీణతలోకి జారింది.   


     వినియోగ వస్తువుల రంగం 2.5 శాతం వృద్ధి నుంచి 0.6 శాతం క్షీణతలోకి పడిపోయింది.
     క్యాపిటల్ గూడ్స్ రంగంలో  క్షీణత మరింత పెరిగింది. ఇది -2.5 శాతం క్షీణత నుంచి - 4.2 క్షీణతలోకి జారింది.  


 ఊహించిన విధంగానే...
 తాజా గణాంకాలపై ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ సీ రంగరాజన్ మాట్లాడుతూ, ఐఐపీ తాజా గణాంకాలు ఊహించిన విధంగానే ఉన్నాయన్నారు. ఫిబ్రవరి-మార్చి నెలల్లో తయారీ రంగం క్రియాశీలత మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement