డబ్బు అవసరం అయితే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల్లో లోన్ తీసుకుంటారు. కానీ తిరిగి ఆ డబ్బు చెల్లించడంలో జాప్యం జరిగితే కొంత అధికమొత్తంగా పేచేయాల్సి ఉంటుంది. అయితే లోన్ కాంట్రాక్ట్ నోట్ ప్రకారం చెల్లించే పేనల్ ఛార్జీలను గతంలో ఆర్‌బీఐ సవరించింది. అందుకు సంబంధించి కీలక ప్రకటన వెలువడింది.
లోన్ అకౌంట్లకు సంబంధించి వేసే పేనల్ ఛార్జీలను అమలు చేయడానికి బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలకు మరో మూడు నెలల సమయం దొరికింది. గతంలోని నిర్ణయించిన దాని ప్రకారం జనవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రావాలి. కానీ, ఏప్రిల్ 1 వరకు ఆర్‌బీఐ పొడిగించింది. బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సెంటర్(ఎన్‌బీఎఫ్‌సీ)లు ఏప్రిల్ 1 నుంచి ఇచ్చే అన్ని ఫ్రెష్ లోన్స్‌పై కొత్త పేనల్ ఛార్జీ రూల్స్ అమలు చేయాలని ఆర్‌బీఐ ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి: నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే..
అయితే ఇప్పటికే ఇచ్చిన లోన్లకు సంబంధించి కొత్త నిబంధనల అమలుకు సంబంధించి ఏప్రిల్ 1 తర్వాత రివ్యూ చేయాలని తెలిపింది. కొత్త రూల్ ప్రకారం, లోన్ కాంట్రాక్ట్‌లోని కండిషన్స్ ఫాలో కాకపోతే బారోవర్లపై వేసే చార్జీలను పేనల్ చార్జీలుగా పరిగణిస్తారు. అంతేతప్పా పేనల్ ఛార్జీలను వడ్డీగా చూడకూడదని ఆర్‌బీఐ తెలిపింది. ఈ ఛార్జీ అప్పుల వడ్డీలపై కూడా పడుతుంది. రూల్స్ పాటించకపోతే తీవ్రతను బట్టి పేనల్ ఛార్జీ ఉంటుంది. పేనల్ చార్జీలపై అదనంగా వడ్డీ వసూలు చేయకూడదు.
Comments
Please login to add a commentAdd a comment