Gadar 2 Actor Sunny Deol Villa Auctioned Due Loan Recovery - Sakshi
Sakshi News home page

Sunny Deol: 'గదర్ 2' హీరో కావాలనే ఇలా చేస్తున్నాడా?

Aug 20 2023 3:30 PM | Updated on Oct 28 2023 1:44 PM

Gadar 2 Actor Sunny Deol Villa Auctioned Due Loan Recovery - Sakshi

బాలీవుడ్ చాలారోజుల తర్వాత మళ్లీ ఊపిరి పీల్చుకుంది. ఈ మధ్య థియేటర్లలో రిలీజైన 'గదర్ 2' సినిమా అద్భుతమైన కలెక్షన్స్ సాధిస్తుండటమే దీనికి కారణం. కెరీర్ ఇక అయిపోయిందనకున‍్న టైంలో సన్నీ డియోల్ ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. అలాంటిది ఈ హీరో ఇప్పుడు కోట్ల రూపాయల అప్పు చేసి ఎగ్గొట్టినట్లు తెలుస్తోంది. అతడి ఖరీదైన విల్లాని వేలానికి రావడంతో ఈ విషయం బయటపడింది.

ఏం జరిగింది?
ముంబయి జుహూ ప్రాంతంలో గాంధీగ్రామ్ రోడ్‌లో సన్నీ డియోల్ కి ఒక విల్లా ఉంది. అయితే దీనిని గ్యారంటీగా పెట్టి, బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ.56 కోట్లు లోన్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు దాన్ని చెల్లించే విషయంలో మాత్రం మొహం చాటేశాడు. బ్యాంక్ నోటీసులు పంపినా సరే స్పందించలేదు. దీంతో ఏకంగా ఆదివారం (ఆగస్టు 20) ఓ ప్రముఖ పేపర్‌లో విల్లాని వేలం వేస్తున్నట్లు సదరు బ్యాంక్ ప్రకటన జారీ చేసింది. 

డబ్బుల్లేవా?
బాలీవుడ్ స్టార్ హీరో ధర్మేంద్ర వారసుడు అయిన సన్నీ డియోల్.. ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి ఉన్నాడు. ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించాడు. అయితే కొన్నాళ్ల నుంచి ఇతడికి సరైన హిట్ అనేది లేదు. దీంతో అందరూ ఇతడి గురించి మర్చిపోయారు. ప్రస్తుతం 'గదర్ 2'తో వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాడు. ఇలాంటి హీరో లోన్ తీసుకుని కట్టకపోవడం ఏంటని అందరూ మాట్లాడుకుంటున్నారు.

అయితే అప్పు తీర్చకపోవడం అనేది ఇతడికి పెద్ద సమస్య కాదు. తలుచుకుంటే ఆ మొత్తాన్ని బ్యాంక్‌లో తీర్చేయొచ్చు. కానీ సన్నీ డియోల్ ఎందుకలా చేస్తున్నాడనే విషయం ప్రస్తుతం అయితే బయటకు రాలేదు. చూడాలి మరి ఈ వేలంలో ఏం జరుగుతుందనేది?

(ఇదీ చదవండి: ఆ ఇల్లు వల్లే ధనుష్‌-ఐశ్వర్య విడిపోయారా..?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement