చిన్నబిడికిలో నవరత్నాల గురించి వివరిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, పాళెంగడ్డ హరిజనవాడలో ఎమ్మెల్యేకు సమస్యలను చెప్పుకుంటున్న మహిళలు
సాక్షి, సంబేపల్లె: అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పి చంద్రబాబు మమ్మల్ని మోసం చేశాడయ్యా అని మహిళలు ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం మండల పరిధిలోని శెట్టిపల్లె పంచాయతీలోని కెకె హరిజనవాడ, కడియాలవాండ్లపల్లె, బండకాడ రాజువారిపల్లె, దిగువరాజువారిపల్లె, హరిజనవాడ, చిన్నబిడికి, మొరంవడ్డెపల్లె, కొత్తవడ్డెపల్లె, నాగిరెడ్డిగారిపల్లె, తాటిగుంట హరిజనవాడ, బుర్రవాండ్లపల్లె, గాలివీటిఇండ్లు, పాలెంగడ్డ పాపన్నగారిపల్లె, హరిజనవాడ, దండూరివాండ్లపల్లె, పెద్దబిడికిలో ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి తనను, మిథున్‌రెడ్డిలను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తమకు సీఎం చంద్రబాబు చేసిన మోసాన్ని డ్వాక్రా మహిళలు ఎమ్మెల్యే ఎదుట ఏకరువు పెట్టారు. 2014 ఎన్నికల సమయంలో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పి దాని ఊసే ఎత్తడం లేదని వాపోయారు.
చెప్పిన ప్రకారం రుణాలను మాఫీ చేయకుండా మూలధనం, పసుపు–కుంకుమ పేరుతో మభ్యపెడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల నుంచి వడ్డీ లేని రుణాల బకాయిలు చెల్లించక తమను మోసగించాడని, మోసాల బాబును నమ్మమని వారు శ్రీకాంత్‌రెడ్డికి స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్న హామీపై తమకు నమ్మకం ఉందన్నారు. ఎస్సీల్లో ఎవరు పుట్టాలనుకుంటున్నారని మాట్లాడి తమను అవమానపరిచాడని, ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని శెట్టిపల్లె గ్రామంలోని దళితులు ఎమ్మెల్యేకి వివరించారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఉపేంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిదంబర్‌రెడ్డి, రమేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి మల్లికార్జునరెడ్డి, నాయకులు లక్ష్మీకర్‌రెడ్డి, శివారెడ్డి, రమణారెడ్డి, అనిరు«ధ్‌రెడ్డి, ఆనందకుమార్‌రెడ్డి, బుల్లి వెంకటరమణ, లక్ష్మణనాయక్, శివయ్య, శ్రీనునాయక్, మహేంద్రనాయక్, వెంకటరమణనాయక్, నరసింహారెడ్డి, నాగూనాయక్, రామాంజులు, నాగయ్య, ప్రభాకర్‌నాయుడు, జనార్ధననాయుడు, శ్రీరాములు, వీరమల్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment