చెన్నై: ప్రముఖ సినీనటుడు రజనీకాంత్ నుంచి డబ్బు గుంజాలని తానెప్పుడూ ప్రయత్నించలేదని ఫైనాన్సియర్ బొర్రా ముకుల్‌చంద్ వెల్లడించారు. ఫైనాన్సియర్ ....నటుడు, ధనుష్ తండ్రి దర్శక నిర్మాత కస్తూరిరాజాపై చెక్కు మోసం కేసులో హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. రజనీకాంత్ పేరు చెప్పి అప్పు తీసుకుని మోసం చేసినట్లు ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు.
కాగా ఈ వ్యవహారంపై నటుడు రజనీకాంత్ బొర్రాపై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అందులో బొర్రా తన పరువుకు భంగం కలిగించే విధంగాను, తననుంచి డబ్బు గుంజే ప్రయత్నంలో భాగంగా కోర్టులో పిటీషన్‌లో తన పేరును పేర్కొనట్లు తెలిపారు. ఈ విషయం ఫైనాన్షియర్ బొర్రా నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తానెప్పుడూ రజనీ నుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేయలేదని, ఆయన పేరును ఉపయోగించి దర్శకుడు కస్తూరిరాజా అప్పు తీసుకుని మోసం చేశారని మాత్రమే అన్నానని తెలిపారు. తాను డబ్బు తిరిగి చెల్లించలేదంటే రజనీకాంత్ ఇస్తారని కస్తూరిరాజా అన్నారని చెప్పారు. రజనీకాంత్ తన పిటిషన్ను వెనక్కి తీసుకోవాలని లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటానని బొర్రా హెచ్చరించారు.
'రజనీ నుంచి డబ్బు గుంజే ప్రయత్నం చేయలేదు'
Published Sat, Jul 11 2015 8:24 AM | Last Updated on Sun, Sep 3 2017 5:19 AM
Advertisement
Advertisement