
ఎవరైనా బ్యాంక్ నుంచి లేదా ఇతర ఫైనాన్సియల్ సంస్థ నుంచి లోన్ తీసివుంటే.. ఎప్పుడెప్పుడు దాన్ని క్లియర్ చేసి ప్రశాంతంగా ఉందామా అనుకుంటారు. కానీ ఒక ఎంబీఏ గ్రాడ్యుయేట్ మాత్రం మూడేళ్ళలో క్లియర్ చేయాల్సిన లోన్‌ను ఎనిమిదేళ్లలో క్లియర్ చేసాడు. ఎందుకు ఆలస్యం చేసాడు అనేదానికి సంబంధించిన వివరాలను రెడ్డిట్‌లో షేర్ చేసాడు.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) బెంగళూరు పూర్వ విద్యార్థి.. మొదట్లో సాధ్యమైనంత త్వరగా తన లోన్ క్లియర్ చేసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆలస్యం చేయడంలో లాభాలు ఉన్నాయని కొన్ని లెక్కల ద్వారా తెలుసుకుని.. లోన్ చెల్లించడానికి తొందరపడటం ఉత్తమ చర్య కాదని గ్రహించాడు.
ఎంబీఏ గ్రాడ్యుయేట్ లోన్ ఆలస్యంగా చెల్లించాలి, అనుకోవడానికి ప్రధాన కారణం పన్ను ప్రయోజనాలు అని రెడ్డిట్‌లో వెల్లడించారు. బహుశా ఈ ప్రయోజనాల గురించి ఎవరికీ తెలుసుకుండకపోవచ్చు లేదా తెలిసినా పట్టించుకోకుండా ఉండొచ్చు. కానీ ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80E కింద, పన్ను చెల్లింపుదారులు ఎనిమిది సంవత్సరాల వరకు చెల్లించే వడ్డీపై 100% పన్ను మినహాయింపు పొందుతారు. రెండు లేదా మూడేళ్ళలో లోన్ క్లియర్ చేస్తే ఈ మినహాయింపు లభించదు. కాబట్టి పూర్తి వ్యవధిలో లోన్ చెల్లించి పన్ను విధించదగిన ఆదాయాన్ని ఎందుకు తగ్గించకూడదని.. అన్నారు.

రెండో కారణం ఏమిటంటే.. ఒక వ్యక్తి రూ. 20 లక్షలు లోన్ తీసుకున్నాడు అనుకుంటే.. 9 శాతం వడ్డీతో మొత్తం రూ. 25 లక్షల నుంచి రూ. 27 లక్షల వరకు చెల్లించాల్సి వస్తుంది. లోన్ తీసుకున్న మొదటి రోజుల్లో లేదా ఈఎంఐలో అసలు కంటే వడ్డీనే ఎక్కువ కట్ అవుతుంది. క్రమంగా ఆ వడ్డీ తగ్గుతూ వస్తుంది. కాబట్టి నా డబ్బును తొందరగా తిరిగి చెల్లించడానికి బదులు.. దానిని పొదుపులు & పెట్టుబడులతో సమతుల్యం చేసుకున్నానని పేర్కొన్నాడు.
ఇదీ చదవండి: మైక్రో రిటైర్మెంట్: ఉద్యోగుల్లో ఇదో కొత్త ట్రెండ్
నేను లోన్ తీసుకుని.. దానిని మళ్ళీ చెల్లించే విషయంలో చాలా తెలివిగా నిర్ణయం తీసుకున్నాను. ఇది నేను తీసుకున్న ఉత్తమ ఆర్థిక నిర్ణయం అని ఎంబీఏ గ్రాడ్యుయేట్ పేర్కొన్నాడు. అయితే త్వరగా అప్పులు తీర్చుకోవడం మంచిది, కానీ ఆర్థిక విషయాల్లో తెలివిగా ఉండటం కూడా మంచిదని.. అదే తాను నేర్చుకున్న పాఠమని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment