ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు వినూత్నంగా నిరసనకు దిగారు. మొండి బకాయిదారుల ఇళ్ల ముందు విజయవాడ సత్యానారాయణపురం ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు గురువారం ధర్నా చేపట్టారు.
విజయవాడ: ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు వినూత్నంగా నిరసనకు దిగారు. మొండి బకాయిదారుల ఇళ్ల ముందు విజయవాడ సత్యానారాయణపురం ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు గురువారం ధర్నా చేపట్టారు. రూ.కోట్లలో లోన్లు తీసుకుని కట్టడం లేదంటూ ఉద్యోగులు ఆరోపించారు. సుమారు రూ.52కోట్ల మేర మొండి బకాయిలు ఉన్నాయని ఉద్యోగులు తెలిపారు. లోన్లు కట్టేవరకూ తాము ఇలాగే ధర్నాలు చేస్తామని బ్యాంక్ ఉద్యోగులు స్పష్టం చేశారు. మరోవైపు నల్లగొండ జిల్లా కోదాడలో మొండి బకాయిల రికవరీ కోసం ఆంధ్రాబ్యాంక్ ఉద్యోగులు శాంతి ర్యాలీ నిర్వహించారు.