అప్పు తీర్చలేక ఇంటిని కోల్పోయిన కేరళ మహిళకు లులు గ్రూప్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ అండగా నిలిచారు. ఆమె చెల్లించాల్సిన లోన్ మొత్తాన్ని చెల్లించడమే కాకుండా.. అదనంగా మరో రూ. 10 లక్షలు సాయం చేశారు.
కేరళలోని నార్త్ పరవూర్‌కు చెందిన సంధ్య 2019లో ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్రైవేట్ సంస్థ నుంచి నాలుగు లక్షల రూపాయలు లోన్ తీసుకుంది. ఇంటి నిర్మాణానికి ఖర్చు పెరగడంతో.. మరింత అప్పు చేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల తరువాత ఆమె భర్త పిల్లలను, తనను వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు.
భర్త ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో సంధ్యకు కుటుంబ పోషణ భారమైంది. దానికి తోడు లోన్ చెల్లించడం కష్టతరమైంది. చాలీచాలని జీతంతో ముందుకుసాగుతున్న ఈమె సకాలంలో లోన్ తీర్చలేకపోయింది. దీంతో వడ్డీతో కలిపి మొత్తం అప్పు రూ. 8 లక్షలకు చేరింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని లోన్ ఇచ్చిన కంపెనీలు ఈమెపై ఒత్తిడి తెచ్చాయి.
లోన్ చెల్లించడంలో విఫలమవడంతో లోన్ ఇచ్చిన సంస్థలు ఇంటిని స్వాధీనం చేసుకున్నాయి. కట్టు బట్టలతో.. పిల్లలతో సహా సంధ్య రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఎంఏ యూసఫ్ అలీ కంటపడటంతో.. తక్షణమే స్పందించారు.
ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలు
సంధ్య లోన్ మొత్తం చెల్లించాలని తన సిబ్బందిని ఆదేశించారు. అంతే కాకుండా వారి జీవితం కొంత సాఫీగా సాగటానికి మరో రూ. 10 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో సంధ్య సమస్యలు తీరిపోయాయి. కష్టాల్లో ఉన్న మహిళకు.. లులు మాల్ అధినేత అండగా నిలబడంతో నెటిజన్లు యూసఫ్ అలీని తెగ మెచ్చుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment