రూ.4000 కోట్లతో షాపింగ్ మాల్.. మూడువేల జాబ్స్ | Lulu Group Ready To Unveils India's Biggest Shopping Mall In Ahmedabad, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

రూ.4000 కోట్లతో షాపింగ్ మాల్.. మూడువేల జాబ్స్: ఎక్కడంటే?

Published Mon, Sep 9 2024 12:46 PM | Last Updated on Mon, Sep 9 2024 1:47 PM

Lulu Group Ready To Unveils India Biggest SHopping Mall in Ahmedabad

భారతదేశంలో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలను విస్తరించడానికి చైర్మన్ అండ్ ఎండీ 'ఎంఏ యూసఫ్ అలీ' ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు అహ్మదాబాద్‌లో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించనున్నట్లు ఈయన పేర్కొన్నారు. దీనికోసం ఇప్పటికే 3,50,000 చదరపు అడుగుల భూమిని సేకరించినట్లు కూడా అలీ వెల్లడించారు.

భారతదేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని యూసఫ్ అలీ అన్నారు. ఈ మాల్ నిర్మాణం పూర్తయితే సుమారు 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ షాపింగ్ మాల్ నిర్మించడానికి సుమారు రూ. 4000 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా.

ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, లక్నో, తిరువనంతపురం, కోయంబత్తూరులలో లులు మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో గత ఏడాది లులు మాల్ ప్రారంభమైంది.

ఇదీ చదవండి: గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్‌లలో ఆ నగరమే టాప్..    

యూఏఈలోని అబుదాబిలో ప్రధాన కార్యాలయాన్ని కలిగిన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికన్ రిటైల్ పరిశ్రమలో ట్రెండ్‌సెట్టర్‌గా పిలువబడుతుంది. ఈ సంస్థ సుమారు 49 దేశాల్లో హైపర్ మార్కెట్‌లు, సూపర్ మార్కెట్‌లను నిర్వహిస్తోంది. ఇందులో ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియా, మలేషియా మొదలైన దేశాలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement