ఇందూరు (నిజామాబాద్): నలభై ఏళ్లు దాటిన ఓ వ్యక్తి కూతురి వయసున్న ఓ బాలికను వివాహమాడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి గ్రామానికి చెందిన రాములు (45) మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన ఓ బాలికను శుక్రవారం బాసర క్షేత్రంలో పెళ్లి చేసుకున్నాడు. అనంతరం బాలికను తీసుకుని అదే రోజు రాత్రి మెంట్రాజ్‌పల్లికి చేరుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్, ఐకేపీ ఉద్యోగులు.. రాములు ఇంటికి చేరుకుని విచారణ జరిపారు. బాలికకు పెళ్లి వయస్సు లేదని నిర్ధారించుకుని జిల్లా బాలల సంరక్షణ విభాగానికి తెలియజేశారు. దీంతో డీసీపీఓ చైతన్య అర్ధరాత్రి మెంట్రాజ్‌పల్లి గ్రామానికి వెళ్లి బాలికను తన అదుపులోకి తీసుకున్నారు. జిల్లా కేంద్రానికి తీసుకు వచ్చి గౌతంనగర్‌లోని స్వధార్ హోమ్‌లో ఆశ్రయం కల్పించారు. ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలికకు సంబంధించిన వయసు ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలని వారికి సూచించారు. తల్లిదండ్రులే బాలికకు పెళ్లి చేశారా ? మరేమైనా కారణాలున్నాయా అని ఆరా తీస్తున్నారు.
బాలికను వివాహమాడిన 45 ఏళ్ల వ్యక్తి
Published Sat, Feb 7 2015 6:09 PM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement
Advertisement