కజకిస్థాన్‌ వధువు– తమిళ వరుడు | Indian Man Married Kazakhstan Women In Tamil nadu | Sakshi
Sakshi News home page

కజకిస్థాన్‌ వధువు– తమిళ వరుడు

Published Tue, Dec 17 2024 12:27 PM | Last Updated on Tue, Dec 17 2024 12:27 PM

Indian Man Married Kazakhstan Women In Tamil nadu

 కమ్యూనిస్టు పార్టీ సభలో వివాహం  

అన్నానగర్‌: అరియలూరు జిల్లా ముల్లుకురిచ్చి గ్రామానికి చెందిన రామచంద్రన్‌ కుమారుడు ప్రభాకరన్‌ (33). ఇతను మార్కిస్టు కమ్యూనిస్ట్‌ పార్టీ సభ్యుడు. గత 2 సంవత్సరాలుగా కజకిస్థాన్‌లోని విమానాశ్రయంలో ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అతడితో పాటు పనిచేసే కజకస్తాన్‌కు చెందిన షేక్‌మెదోవ్‌ కుమార్తె ఐ దానా(29)కు మధ్య పరిచయం ఏర్పడింది. చివరికి ఈ అది ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని తల్లిదండ్రులకు చెప్పారు.  వివాహానికి ఇరు కుటుంబాలు పచ్చజెండా ఊపారు. 

తమిళ సంస్కృతి ప్రకారం ప్రభాకరన్‌ తమిళనాడులో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దాని ప్రకారం ఐ దానా కుటుంబం అరియలూరుకు వచ్చింది. కాగా, మార్కిస్టు కమ్యూనిస్టు పార్టీ 24వ జిల్లా సదస్సు ఆదివారం కడలూరు జిల్లా పన్నాడంలోని ఓ ప్రైవేట్‌ హాలులో జరిగింది. ఈ సమావేశ వేదికపై పెళ్లికి ఏర్పాట్లు కూడా జరిగాయి. తమిళ సంçస్కృతి ప్రకారం వరుడు పట్టు పంచె, వధువు పట్టుచీరలో సమావేశ వేదికపైకి వచ్చారు. కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు వాసుకి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రభాకరన్, ఐ దానా కి తాళి కట్టారు. ఈ వేడుకకు బంధువులు, స్నేహితులు, పార్టీ సభ్యులు అందరూ హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement