హర్యానాలోని గురుగ్రామ్‌లో జరిగిన వింత పెళ్లి వేడుక స్థానికంగా చర్చనీయాంశంగామారింది. ఇద్దరు యువతులు ఆచార సంప్రదాయాలు పాటిస్తూ, పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుకలో ఇతర వివాహాలలో మాదిరిగానే అన్ని వ్యవహారాలు జరిగాయి.
మీడియాకు అందిన వివరాల ప్రకారం ఈ వివాహ వేడుక హల్దీ వేడుకతో మొదలై అప్పగింతలతో ముగిసింది. కవితా టప్పు, అంజు శర్మలు వధూవరులుగా మారి దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. వధువు వేషధారణలో ఉన్న కవిత, వరుడి వేషధారణలో ఉన్న అంజు శర్మ వేదికపై కుర్చీలలో కూర్చుని అతిథుల ఆశీర్వాదాలు అందుకున్నారు.
భారతదేశంలో స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు లేదు. అయినప్పటికీ వీరి వివాహానికి ఎటువంటి ఆటంకం ఎదురుకాలేదు. ఈ వివాహానికి కవిత, అంజుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు హాజరయ్యారు. అయితే పెళ్లి జరిపించాల్సిన పురోహితునికి తాను ఇద్దరు యువతులకు పెళ్లి చేయాల్సి ఉందని తెలియానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే వారి బంధువులలో ఒకరు ఆ పురోహితుడిని ఒప్పించి వివాహ వేడుక సవ్యంగా జరిగేలా చూశారు.
Comments
Please login to add a commentAdd a comment