Rs 500 fake notes
-
అలాంటి రూ. 500 నోట్లు చెల్లవా..?
సోషల్ మీడియాలో రూ. 500 నోటుకు సంబంధించిన ఓ ఫేక్ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ నోటు నకిలీదో లేక ఒరిజినల్‌దో ఇలా తెలుసుకోవాలని అధికారిక ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్(PIB) ట్విట్టర్లో తెలిపింది. కాగా, ఓ 500 రూపాయల నోటుపై గాంధీ బొమ్మ.. ఆకుపచ్చ గీతకు దగ్గరగా RBI గవర్నర్ సంతకంపైన.. ఉన్న నోటు నకిలీది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై పీఐబీ క్లారిటీ ఇచ్చింది. నోటుపై ఉన్న గాంధీ బొమ్మ ఆకుపచ్చ గీతకు దగ్గరగా, దూరంగా ఉన్న రెండు నోట్లు సరైనవేనని తెలిపింది. “RBI ప్రకారం రెండు రకాల నోట్లు చెల్లుబాటు అవుతాయి.” అని పేర్కొంది. ఈ క్రమంలోనే కొత్తగా విడుదలవుతున్న రూ. 500 నోట్లు ప్రస్తుతం రంగు, పరిమాణం, థీమ్, భద్రతా ఫీచర్ల స్థానం, డిజైన్ అంశాలలో పాత సిరీస్‌కు భిన్నంగా ఉన్నాయని స్పష్టం చేసింది. కొత్త నోటు పరిమాణం 66mm x 150mm ఉందని తెలిపింది. ఒక నోటు నకిలీదో కాదో నిర్ధారించుకోవడానికి, ఆర్బీఐ పాయింటర్లు, ప్రభుత్వ నిజ నిర్ధారణ సంస్థల్లో తెలుసుకోవాలని సూచించింది. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ వార్తలను నమ్మవద్దని హితవు పలికింది. एक मैसेज में यह दावा किया जा रहा है कि ₹500 का वह नोट नकली है जिसमें हरी पट्टी आरबीआई गवर्नर के सिग्नेचर के पास ना होकर गांधीजी की तस्वीर के पास होती है।#PIBFactCheck ➡️यह दावा #फ़र्ज़ी है। ➡️@RBI के अनुसार दोनों ही तरह के नोट मान्य होते हैं। 🔗https://t.co/DuRgmRJxiN pic.twitter.com/AEGQfCM8kZ — PIB Fact Check (@PIBFactCheck) May 11, 2022 ఇది కూడా చదవండి: ఈలాన్‌మస్క్‌కి మద్దతు పలికిన కేంద్ర మంత్రి! -
గాంధీ బొమ్మను మరిచిపోయారట!
భోపాల్: నిత్యవసర సరుకుల కొనేందుకు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎం కేంద్రానికి వెళ్లిన వ్యక్తికి కొత్త 500 రూపాయల నోట్లు నకిలీవి రావడంతో షాక్ తిన్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మోరేనాలో ఆదివారం చోటుచేసుకుంది. బాధితుడు గోవర్ధన్ శర్మ నేటి ఉదయం డబ్బులు డ్రా చేసుకునేందుకు మోరెనాలోని ఏ ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. డబ్బు డ్రా చేసిన తర్వాత షాక్ తినడం అతడి వంతయింది. ఏటీఎం నుంచి వచ్చిన రూ.500 నోట్లపై మహాత్మాగాంధీ బొమ్మ ముద్రించి లేకపోవడంతో నకిలీ నోట్లు అని గుర్తించి తాను మోసపోయానని గ్రహించాడు. ఏటీఎం సెంటర్ వద్ద ఉన్న సెక్యూరిటీ గార్డుకు తాను డ్రా చేసిన నోట్లను చూపించి అసలు విషయాన్ని చెప్పాడు. అతడు ఏటీఎంలో ఉన్న హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేశాడు. వెంటనే ఎస్బీఐ అధికారులు కొందరు ఏటీఎం వద్దకు వచ్చి నోట్లను పరిశీలించారు. అవి నకిలీ నోట్లు కాదని, అయితే ఆ నోట్లపై గాంధీజీ బొమ్మను ముద్రించడం మరిచిపోయారని వివరణ ఇచ్చుకున్నారు. ఆ నోట్లను తిరిగి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియాకు పంపిస్తామని ఆ ఎస్బీఐ ఉద్యోగి వివరించారు. పెద్ద నోట్లరద్దు చేసిన ఐదు నెలల తర్వాత కూడా దేశవ్యాప్తంగా పలు నగరాలలో ఏటీఎం కేంద్రాలు ఖాళీగా దర్శనమిస్తుండగా.. మరోవైపు పదే పదే ఎస్బీఐ ఏటీఎంలలో ఇలా నకిలీ నోట్లు వస్తుండటంతో జనాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గతంలో సౌత్ ఢిల్లీ అమర్ కాలనీ ప్రాంతంలోని ఒక ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో నకిలీ రూ.2 వేల నోట్లు దర్శనమిచ్చాయి. అంతకుముందు ఢిల్లీలోని మరో ఏటీఎం నుంచి ఓ వ్యక్తి డబ్బులు డ్రా చేసినపుడు చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నకిలీ నోటు కనిపించడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోనూ షాజహాన్పూర్లో పలు ఏటీఎం కేంద్రాల నుంచి రూ. 2000 నోట్లు నకిలీవి కలకలం రేపిన విషయం తెలిసిందే.