ఈ ఏడాది మార్చి నెలలో లాక్ డౌన్ విధించడంతో చాలా మంది ప్రజలు ఆర్థికంగా నష్టపోయి పేదరికంలో కూరుకుపోయారు. వీరికోసం అని పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన ప్రతి పౌరుడికి కోవిడ్ ఫండ్‌గా రూ.1,30,000 చెల్లిస్తామని భారత ప్రభుత్వం వాగ్దానం చేసిందని అనే వార్త వాట్సాప్ లో తెగ వైరల్ అవుతుంది. ఈ కోవిడ్ ఫండ్ రూ.1,30,000 నగదును పొందడానికి, మీ అర్హతను ధృవీకరించడం కోసం అందించిన లింక్‌పై క్లిక్ చేయండి అనే మెసేజ్ బాగా వాట్సాప్ లో వైరల్ అవుతుంది. అయితే ఈ మెసేజ్ పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది. (చదవండి: పబ్‌జీ లవర్స్‌కి గుడ్ న్యూస్)
ఈ సందేశం పూర్తిగా నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో యొక్క ఫాక్ట్-చెక్ బృందం ట్విట్టర్లో ధృవీకరించింది. "దావా: 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ 130,000 # కోవిడ్ ఫండింగ్‌గా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు # వాట్సాప్‌లో ప్రసారం చేసిన సందేశంలో పేర్కొంది". పిఐబి ఫాక్ట్-చెక్: ప్రభుత్వం అలాంటి ప్రకటన చేయలేదు అని పిఐబి ట్విట్టర్‌లో రాసింది.
Claim: A message circulating on #WhatsApp claims that the Government has ordered payment of ₹130,000 as #Covid funding to all citizens above the age of 18.#PIBFactCheck: The claim is #Fake. No such announcement has been made by the Government. pic.twitter.com/NF8dH08wLW
— PIB Fact Check (@PIBFactCheck) November 24, 2020
వాట్సాప్లో ఈ మెస్సేజ్ ను ఫార్వార్డ్ చేయడం ద్వారా విస్తృతంగా వైరల్ అవుతుంది. మనకు ఇలాంటి మెసేజ్ లను చూడటం మాములే కావచ్చు కానీ, ఇలాంటి లింక్ ల ద్వారా మన యొక్క డేటాను దొంగిలించడానికి హ్యాకర్లు ఇలాంటి వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఒక వేళా మనం ఆ లింక్ ను క్లిక్ చేస్తే మన వ్యక్తి గత డేటా, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర వివరాలు హ్యాకింగ్ గురి అయ్యే అవకాశం ఎక్కువ. అందుకని ఇలాంటి మెసేజ్ లు వస్తే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవడంతో పాటు వీటి నుండి జర జాగ్రత్తగా ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment